కరోనా ప్రభావంతో థియోటర్స్ ఎప్పుడు తెరుస్తారు..ఎప్పుడు తమ సినిమాలు రిలీజ్ అవుతాయనే విషయమే ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఇచ్చుకున్న వాళ్లంతా వాటిని మార్చుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలు వాళ్లు రిస్క్ చేయదలుచుకోవటం లేదు. ఈ నేపధ్యంలో  ఏడాది పండోరా ప్రపంచాన్ని వెండితెరపై చూడొచ్చు అని ఆశపడిన ‘అవతార్‌’ ఫ్యాన్స్‌  నిరాశ పడుతున్నారు. ‘అవతార్‌ 2’ చిత్రం వాయిదా పడుతుందని అంచనా వేసుకున్నారు. అయితే మాగ్జిమం అలాంటిదేమీ ఉండదని, ఈ సంవత్సరం అనుకున్న తేదీకే రిలీజ్ చేయవచ్చు అనే  విషయాన్ని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వెల్లడించారు. 

 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్‌ అవుతుందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అది ఖరారు చేసారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్‌ 2020 డిసెంబర్‌లోనే రిలీజ్‌ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాటు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

2009లో జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్‌ అవతార్‌. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో నాలుగు సీక్వెల్స్‌కు ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్. వరుసగా నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా  రిలీజ్‌ అయిన అవెంజర్స్‌ : ఎండ్‌గేమ్‌.. అవతార్‌ రికార్డ్‌లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో అవతార్‌ 2తో మరోసారి కామెరూన్‌ ఆల్‌టైం రికార్డ్‌ను సాధిస్తాడని అంచనా వేస్తున్నారు.