దర్శకుడు రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. యాభైకి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా నటించిన తనకు దర్శకుడు రవిబాబు అవకాశాలు రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది.

గత కొన్నాళ్లుగా తనకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పుతున్నా.. ఇండస్ట్రీ తనను పట్టించుకోవడం లేదని.. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నట్లు.. దర్శకులు నిర్మాతల పక్కల్లోకిఅయితే మేం వెళ్లాలి.. సినిమా ఆఫర్స్ మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారని సంచలన కామెంట్స్ చేసింది.

గతంలో తను పని చేసిన దర్శకులు, నిర్మాతల వద్దకు వెళ్తుంటే ఎవరో తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని.. బెదిరిస్తున్నారని వెల్లడించింది. 'నువ్విలా' సినిమా కోసం దర్శకుడు  రవిబాబుతో కలిసి పని చేశానని చెప్పిన శిరీషా.. అతడు తనతో చాలా తప్పుగా ప్రవర్తించేవాడని.. 'నీ రేటు ఎంత..?' అంటూ బూతులు మాట్లాడేవాడని.. అతడు చేసిన మెసేజ్ లను చూపించింది.

రెండేళ్ల నుండి తనను టార్చర్ చేస్తున్నాడని.. అవకాశాల కోసం దర్శకనిర్మాతలను సంప్రదిస్తుంటే.. వాళ్లకి ఫోన్లు చేసి అవకాశాలు ఇవ్వకూడదని చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడి పక్కలోకి వెళ్లలేదని బతుకు లేకుండా చేస్తున్నాడని.. పెద్ద డైరెక్టర్ కదా అని తనను ఏం చేస్తాడో అని భయపడి ఎవరికి చెప్పలేదని..రవిబాబు కారణంగా తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది.