చికాగో సెక్స్ రాకెట్... నా ఫోటో ముద్రించారు : నటి ప్రగతి

Artist pragathi shares her experience with chandrakala and kishan
Highlights

చికాగో సెక్స్ రాకెట్... నా ఫోటో ముద్రించారు : నటి ప్రగతి

తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో మరికొందరు నటీనటులకు కష్టాలు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది.

న‌టి ప్ర‌గ‌తి మాట్లాడుతు కిష‌న్ అలియాస్ శ్రీ‌రాజ్ అనే వ్య‌క్తి అమెరికా నెంబ‌ర్‌తో త‌న‌కు ఫోన్ చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా ఆమె గుర్తు చేసుకుంది. అయితే, అత‌ను మాట్లాడే విధానం త‌న‌కు న‌చ్చ‌క పోవ‌డంతో తిర‌స్క‌రించాన‌ని, అయిన‌ప‌ప‌టికీ వారు ప్ర‌చురించిన పోస్ట‌ర్‌లో త‌న ఫోటోను ముద్రించార‌ని చెప్పుకొచ్చింది. ఆ ఈవెంట్‌లో తాను పాల్గొన‌లేద‌ని చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా తాను అమెరికా వెళ్ల‌లేద‌ని చెప్పిన సినీ న‌టి ప్ర‌గ‌తి 2014, 2016లో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ ప్ర‌ముఖ వ్య‌క్తితో క‌లిసి ఈవెంట్ల‌లో పాల్గొన్న‌ట్టు ఒప్పుకుంది. అయితే, తెలుగు సంఘాల వారు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న త‌న‌కు అక్క‌డి ప‌రిస్థితులు చూసి ఆశ్చ‌ర్య మేసింద‌ని, త‌న‌తో పాటు కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వాళ్లంతా.. షాపింగ్ పేరుతో ఏవేవో మాట్లాడుకోవ‌టాన్ని తాను విన్న‌ట్టు ప్ర‌గ‌తి చెప్పింది. న‌టి ప్ర‌గ‌తికి చికాగో సెక్స్ రాకెట్‌కు ఎలాంటి సంబందం లేద‌ని తెలుస్తోంది.

loader