చికాగోలో లో ఆరోజు రాత్రి నా చేయి పట్టుకుని లాగాడు : అర్చన

Artist archana shares her experience in chiocago
Highlights

అర్ధరాత్రి ఆ మేనేజర్ నా గదిలోకి వచ్చాడు

అమెరికాలో బయటపడిన చికాగో సెక్స్ రాకెట్ ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఈ రాకెట్ నిర్వహించిన కిషన్-ఆయన భార్య చంద్రలను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో ఐదుగురు హీరోయిన్లను అక్కడి పోలీసులు విక్టిమ్స్ గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ విక్టిమ్స్ ఎవరన్న దానిపై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. ఫలానా హీరోయిన్ అని.. ఫలానా యాంకర్ అంటూ మీడియాలో కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, ఈ విష‌యంపైనే ఒక ఛానెల్ నిర్వ‌హించిన డిబేట్‌లో ప్ర‌ముఖ న‌టి అర్చ‌న పాల్గొని అమెరికాలో త‌న‌కు ఎదురైన ఒక చేదు అనుభ‌వాన్ని చెప్పుకొచ్చింది. గ‌త సంవ‌త్స‌రం తెలుగు సంఘాల వారు నిర్వ‌హించిన ఒక కార్య‌క్రమంలో పాల్గొనాలంటూ త‌న‌కు ఆహ్వానం అందింద‌ని, మ‌న తెలుగువారే క‌దా..! అనే ఆలోచ‌న‌తో, ఆహ్వానం అంద‌డంతో చికాగో వెళ్లిన‌ట్టు తెలిపింది.

కార్య‌క్ర‌మంలో భాగంగా వ‌చ్చిన అతిధులంద‌రికీ ఒక ఫైవ్ స్టార్ హోట‌ల్లో రూములు బుక్ చేశార‌ని, వారిలో తాను కూడా ఉన్న‌ట్టు అర్చ‌న తెలిపింది. తెలుగు సంఘాల కార్య‌క్ర‌మాలు ముగిసిన రోజున అర్థ‌రాత్రి తెలుగు సంఘాల‌కు చెందిన ఒక మేనేజ‌ర్ త‌న గ‌దికి కాలింగ్ బెల్ నొక్కాడ‌ని, డోర్ తీయ‌డంతో లోప‌లికి వ‌చ్చేశాడ‌ని చెప్పింది. పూర్తి పేమెంట్ ఇచ్చేందుకు వ‌చ్చాను మేడ‌మ్‌.. ఇంకా ఏమ‌న్నా పేమెంట్ కావాలంటే చెప్పండి మేడ‌మ్ అని అడ‌గ‌సాగాడ‌ని, ఆ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న‌ను గ‌మ‌నించిన వెంట‌నే త‌న‌ను రూము నుంచి బ‌య‌ట‌కు గెంటేశాన‌ని అర్చ‌న చెప్పింది. అయినా ఆ వ్య‌క్తి త‌న చేయిప‌ట్టుకుని ఏదో క‌క్ష‌క‌ట్టిన‌ట్టుగా లాగాడ‌ని, వెంట‌నే ప్ర‌తిఘ‌టించ‌డంతో ఆ మేనేజ‌ర్ త‌న రూమును వ‌దిలి వెళ్లిపోయాడ‌ని తెలిపింది. మ‌రుస‌టి రోజున వెంట‌నే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చేసిన‌ట్టు త‌న  అనుభ‌వాల‌ను అర్చ‌న‌ తెలిపింది.

loader