సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు స్పెషల్ గా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు యంగ్ సింగర్ అర్మాన్ మాలిక్.  సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ వినతీ అంటూ ట్వీట్టర్ లో ఆయన ఏమన్నారంటే..  

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు స్పెషల్ గా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు యంగ్ సింగర్ అర్మాన్ మాలిక్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు స్పెషల్ వినతీ అంటూ ట్వీట్టర్ లో ఆయన ఏమన్నారంటే.. 

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు సర్కారువారి పాట సినిమా కోసం ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వ‌ర‌లో స‌ర్కారు వారి పాటతో సంద‌డి చేసేందుకు రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్. ప‌ర‌శురాం డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ మే 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. 

ఈ క్రమంలోనే సర్కారువారి పాటకు సంబంధించి సూప‌ర్ క్రేజీ అప్ డేట్‌ను సింగ‌ర్ అర్మాన్ మాలిక్ అందించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళావ‌తి, పెన్నీ సాంగ్స్ సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. క‌ళావ‌తి సాంగ్ అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్ల‌గొడుతోంది. తాజా మూడో పాట‌కు సంబంధించిన అప్ డేట్ ఇండైరెక్ట్ గా ఇచ్చాడు అర్మాన్ మాలిక్ 

Scroll to load tweet…

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ట్వీట్ చేస్తూ.. మాలిక్ ఏమన్నాడంటే.. నాకు సందేశాలు పంపుతున్న మ‌హేశ్ బాబు అభిమానులంద‌రికి, నిజంగా స‌ర్కారు వారి పాట నుంచి మ‌రో పాట ఎప్పుడు వ‌స్తుంద‌నేదాని గురించి నా దగ్గర ఎలాంటి క్లూ లేదు. న‌న్ను న‌మ్మండి, నాకు కూడా తెలియ‌దు అన్నాడు. ప్ర‌తీ దానికి ఒక ఇంటర్న‌ల్ ప్రాసెస్ ఉంటుంది. మేమంతా ఓపిక‌గా ప‌నిచేస్తున్నాం. అధికారిక ప్ర‌క‌ట‌న కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.

అర్మాన్ మాలిక్ చేసిన‌ ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.ఇక సర్కారువారి పాట సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్ల‌స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ సర్కారువారి పాట సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.