కొంచెం అయినా సిగ్గు ఉండాలి అంటు బూతులు తిట్టిన అర్జున్ కపూర్

Arjun kapoor fires on a website
Highlights

చెల్లిపై ప్రేమను చూపించిన అర్జున్ కపూర్

శ్రీదేవి మరణంతో ఒక్కసారిగా మొత్తం కుటుంబం శ్లోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నకుటుంబ సభ్యులు. అమ్మ కుచ్చిలుగా పెరిగిన పిల్లలు అయోమయంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుమనిగి ఓ కొలిక్కి వచ్చారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే... శ్రీదేవి ఉన్నత వరకు బోని కుటుంబానికి అర్జున్ కపూర్ కు మధ్య మాటలు లేవు. అర్జున్ కపూర్ కనీసం తన తండ్రి బోనితో కూడా ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు వారి మధ్య బంధం బాగా బలపడింది. తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని అర్జున్ కపూర్ బాధ్యతగల అన్నగా చేరదీస్తున్నాడు. వారికీ అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తన్నాడు. 

 ఇటీవల బోనీ కపూర్ తన కుమార్తెలతో అర్జున్ కపూర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో జాన్వీ వేసుకున్న డ్రెస్ ని హైలైట్ చేస్తూ ఓ వెబ్ సైట్ అసభ్యంగా ఫోటో చిత్రీకరించింది. ఈ విషయం అర్జున్ కపూర్ దృష్టికి రావడంతో అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సదరు వెబ్ సైట్ ని బూతులు తిడుతూ తన ఆగ్రహం వ్యక్తం చేసాడు. మీరు చేసింది సిగ్గుమాలిన చర్య అంటూ బుద్ది చెప్పాడు. యువతీ పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అర్జున్ కపూర్ ప్రశ్నించడం విశేషం. అర్జున్ కపూర్ ఘాటు రియాక్షన్ కు నెటిజన్ల నుంచి మద్దత్తు లభిస్తోంది. చెల్లెళ్లపై అర్జున్ కపూర్ ఇలా తన ప్రేమని చాటుకున్నాడని అర్జున్ కపూర్ అభిమానులు అంటున్నారు.

loader