ప్రంపంచ రికార్డ్ లను తన సొంతం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మన్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఖాతాలో చరిత్రలో నిలిచిపోయేలా అరుదైన మర్యాద దక్కింది అది కూడా ఇక్కడ కాదు కెనడాలో.
ఎన్నో ప్రపంచ రికార్డ్ లు.. ఎన్నో వరల్డ్ అవార్డ్ లు.. గ్రామీ, ఆస్కార్ లాంటి అమూల్యమైన అవార్డులను సొంత చేసుకున్న ప్రముఖ ఇండియాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పట్ల కెనడా తన గౌరవ భావాన్ని చాటుకుంది. కెనడాలోని మార్కమ్ అనే చిన్న పట్టణంలోని ఓ వీధికి ఏఆర్ రెహమాన్ పెరు పెట్టి.. ఆయనపై తమ ప్రేమను చాటుకున్నారు. దాదాపుగా 3 లక్షల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణం టొరంటోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక ఈ అరుదైన గౌరవాన్ని పొందిన విషయాన్ని ఏఆర్ రెహమాన్ స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యాక్తం చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా మార్కమ్ పట్టణ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టికి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు ఏఆర్ రెహ్మాన్. ధన్యవాదాలు తెలియజేస్తూ... ఒక స్టేట్ మెంట్ కూడా రిలీజ్ చేశారు. కెనడా ప్రజల పట్ల కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. అయితే ఏఆర్ రెహ్మాన్ తన స్టేట్ మెంట్ లో ఇలా రాశారు...
నేను నా జీవితంలో ఇలాంటిది ఊహించలేదు. నిజంగా మీ అందరికీ, మార్కమ్ మేయర్ ఫ్రాంక్ స్కార్ పిట్టి, కౌన్సిలర్లు, ఇండియన్ కాన్సులేట్ జనరల్ తో పాటు.. కెనడా ప్రజలకు కృతజ్ఞుడిని అని అన్నారు. ఏఆర్ రెహమాన్ అన్న పేరు నాది కాదు. నా పేరుకు అర్ధం దయాగుణం.. ఇది మనందరి ఉమ్మడి దేవుడి గుణం... ఈ పేరు కెనడా ప్రజలకు ప్రశాంతతను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దేవుడి దీవెనలు ఉండాలి అన్నారు రెహ్మాన్.
ఇక ఇండియాలో నా పట్ల ప్రేమ చూపించే నా బ్రదర్స్, సిస్టర్స్ తో పాటు అందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంటూ బావోద్వేగానికి లోనయ్యారు రెహ్మాన్. ఎంతో టాలెంట్ ఉంది.. నాతో పాటు పనిచేసి నన్ను వందేళ్ల సినిమా ప్రపంచంలో సెలబ్రిటీని చేశారు. కానీ, నేను ఈ సముద్రంలో చిన్న బిందువును. విశ్రాంతి తీసుకోకుండా మరింత సేవ చేయాలని, స్ఫూర్తినీయంగా ఉండాలని నాపై బాధ్యతను ఇది పెంచింది అంటూ.. రెహ్మాన్ ట్విట్టర్ నోట్ ను రిలీజ్ చేశారు.
