అనుష్క ‘నిశ్శబ్దం’ రివ్యూ


ఇప్పటివరకు తెలుగులో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తి స్దాయిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన నాని వి సినిమా బోల్తా పబడటంతో... పెద్ద సినిమాలు ఓటీటిలో రిలీజ్ చేయాలంటే భయపడే సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.  ఇలాంటి పరిస్దితుల్లో ...ధైర్యం చేసి అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో  విడుదల చేసారు. ఈ థ్రిల్లర్ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే అనుష్క సినిమా అంటే ఖచ్చితంగా చూసే అభిమానులు ఉన్నారు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అయ్యిందా..స్టోరీ లైన్  ఏంటి...షాలినీ పాండే, మాధవన్, అంజలి పాత్రలు ఏమిటి..ఈ సినిమా అనుష్క కెరీర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతుంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Anushka Shetty-Madhavan s Nishabdham review

కథేంటి

 1972లో అమెరికాలో కథ జరుగుతుంది. అక్కడ ఓ విల్లా లో  భార్యాభర్తలు హత్యకు గురవుతారు. ఆ చనిపోయిన అతను ఓ పెయింటర్. ఆ హత్య ఎవరు చేసారు...ఎందుకు చేసారు అనేది మిస్టరీగా మిగిలిపోతుంది. చివరకు ఆ మర్డర్ చేసింది...ఓ దెయ్యం అని ఆ ఇంటిని హాంటెడ్ హౌస్ గా వదిలేస్తారు. ఇప్పుడు 2020లోకి వస్తే... ఈ మధ్యనే ఓ డబ్బున్న వ్యక్తి ఆక్షన్ లో ఆ ఇంటిని కొనుక్కుని కాస్త రంగలు గట్రా వేయించాడు. బాగు చేయించాడు. 

ఇక అమెరికా సియోటల్ లో  ఉంటున్న  మంచి పెయింటర్ అయిన సాక్షి (అనుష్క) చెవిటి, మూగ అమ్మాయి. ఎవరైనా మెల్లిగా మాట్లాడితే లిప్ రీడింగ్ తో అర్దం చేసుకోగలదు. ఆమెతో  సెలబ్రిటీ మ్యుజీషియన్.. మిలియనీర్   ఆంటొని (మాధవన్) ప్రేమలో పడతాడు. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటారు. అయితే ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సాక్షి క్లోజ్ ప్రెండ్ (షాలినీ పాండే) మిస్ అవుతుంది. దాంతో ఆమె చాలా డిస్ట్రబ్ అవుతుంది.  ఆ మిస్సింగ్ కేసుని పోలీస్ లు సాల్వ్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. సాక్షిని మాములు మూడ్ లోకి తీసుకురావటానికి ఆంటోని..ఆమెను తీసుకుని ట్రిప్ కు వెళ్తాడు. 

ఈ క్రమంలో సాక్షి ...పైన చెప్పుకున్న హాంటెడ్ హౌస్ లో ఉన్న ఓ పెయింటింగ్ కావాలంటుంది. తన కాబోయే భార్య కోరిక తీర్చటం కోసం ఆంటోని...ఆ ఇంటి తాళం చెవులు తీసుకుని వస్తాడు. ఇద్దరూ కలిసి ఈ హౌస్ లోకి వెళ్తారు. ఈ సారి కూడా అంతకు ముందు హత్య జరిగిన గదిలోకి వెళ్లిన ఆంటోని హత్యకు గురి అవుతాడు. కానీ, సాక్షి తప్పించుకుంటుంది. కానీ బాగా భయపడిపోతుంది. అప్పుడు ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకుని సాల్వ్ చేయటానికి  అక్కడ పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా  పనిచేస్తున్న  తెలుగు అమ్మాయి మహా (అంజలి) రంగంలోకి దిగుతుంది. 

అంజలి కి తోడుగా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడ్సన్ తోడుగా ఉంటాడు.సాక్షి నుంచి అసలేం జరిగిందో తెలిసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఏ నిజాలు బయిటపడ్డాయి. అసలు ఆంటోనిని చంపింది ఎవరు...సాక్షి స్నేహితురాలు షాలినీ పాండే ఎలా మిస్సైంది...అసలు ఆ హాంటెండ్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయా.... ఈ మొత్తం తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఈ సినిమా ప్రారంభంలో కథలోకి చాలా వేగంగా వెళ్లిపోయారు. మనం సెటిల్ అయ్యి..ఆ పాత్రలు మనకు డైజస్ట్ కాకుండానే ..కథలో మొదట మలుపు తెచ్చేసారు. చాలా హడావిడిగా జరిగిపోయినట్లు అనిపిస్తుంది. కాస్తంత అనుష్క, మాధవన్ పాత్రలను ఎస్టాబ్లిష్ చేసి, వాటితో మనకు ఎమోషన్ కనెక్టివిటి ఏర్పడ్డాక..ప్లాట్ పాయింట్ వన్ గా ...ఆ హాంటెడ్ హౌస్ .. చాలా కాలం తర్వాత ఈ జంట వెళ్తున్నారు అని అంటే..మనకు టెన్షన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ..ఆ మూగ అమ్మాయి సాక్షిని అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకుందామనుకున్నవాడు హత్యకు గురి కాబడ్డాడే..అయ్యో...ఆ చంపిన వాళ్లు దొరకాలి..అది దెయ్యమైనా పడేసి ముక్కలు చేయాలనిపిస్తుంది. అలా కాకుండా డైరక్ట్ గా  కథలోకి వెళ్లటం కాస్తంత ఇబ్బంది కలిగించింది. 

అలాగే ఈ కథ ...అనుష్క వైపు నుంచి..కాసేపటికి అంజలి సినిమాగా మారిపోతుంది. ఆమె ఇన్విస్టిగేషన్ తో అంజలి హీరోయిన్ గా వచ్చిన కథలో అనుష్క గెస్ట్ అనిపిస్తుంది. దీనికి తోడు ఎప్పుడైతే.. ఆ మర్డర్ మిస్టరీ వెనక ఉన్న అసలు కారణం తెలిసిపోయిందో అప్పుడే సినిమాపై ఇంట్రస్ట్ పోతుంది. దాంతో సినిమా చివరి ఇరవై నిముషాలు బోర్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా కథని దర్శకుడు సూపర్ హిట్ చిత్రం మన్మధ ప్రేరణతో రాసుకున్నట్లున్నారు. కానీ సరిగా ఎడాప్షన్ చేయలేదు. చాలా లింక్ లు జస్టిఫై కాకుండానే ఈ థ్రిల్లర్ లో మిగిలిపోయాయి. అయినా అంత స్లోగా నడిపితే కానీ ఇలాంటి కథలు చెప్పలేరా?

దర్శకత్వం మిగతా విభాగాలు

మొదట హారర్ గా ఆ తర్వాత థ్రిల్లర్ గా మారిన ఈ సినిమా స్క్రిప్టు దశలోనే పాయింటాఫ్ ప్లాబ్లంలు సరిచేసుకుంటే చూసేటప్పుడు కాస్త క్లారిటీ గా ఉండేది. ముఖ్యంగా అనుష్క లాంటి స్టార్ ఉన్నప్పుడు ఆమె పాయింటాఫ్ నుంచే కథను చూస్తాం. అంతేకానీ డైరక్టర్ పాయింటాఫ్ నుంచి కష్టం. డైరక్టర్ అది గమనింజచినట్లు లేదు. ఇక దర్శకుడుగా హేమంత్ మధుకర్...అనుష్క, మాధవన్ , అంజలి, శాలిని పాండే మంచి పర్ఫార్మర్స్  ఉన్న ఆర్టిస్ట్ లను కూడా సరిగా వాడుకోలేకపోయారు.  కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఏమాత్రం కథకు కలిసి రాలేదు. సినిమాకు క్లాసీ లుక్..అదే హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తీసుకురావాలని చాలా ట్రై  చేసారు. 

విజువల్స్ అందుకు సహకరించాయి. హాలీవుడ్ కాస్టింగ్ పెట్టడం కూడా కలిసొచ్చింది. అయితే తెలుగు సినిమా చూద్దామని కూర్చున్నవాళ్లకు ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లు అనిపించటానికి కూడా అదే కారణమైంది. ఇక గిరీష్ గోపాలక్రిష్ణన్  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయం లేని సీన్స్ ను కూడా ఇంట్రస్టింగ్ గా చూసేలా చేసింది.  గోపీ సుందర్ అందించిన పాటల ఫరవాలేదు. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన ‘నిన్నే నిన్నే’ సాంగ్  బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ పూడికు చూసినోళ్లు ధాంక్స్ చెప్పాలి. ఎక్కువ లెంగ్త్ వదలకుండా కుదించాడు.  నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు


మూగ, చెముడు ఉన్న అమ్మాయిగా నటించంటం అంటే ఏ ఆర్టిస్ట్ కైనా సవాలే. కేవలం కళ్లు, హావభావలతో సీన్ ని పండిచగలగాలి. అటువంటి అరుదైన ఫీట్ ని అనుష్క వంటి స్టార్ హీరోయిన్ చేస్తోందంటే ఖచ్చితంగా ఉత్సుకత ఉంటుంది.   అయితే ఆమె పాత్రలో ఎక్కడా డెప్త్ లేదు. దానికి తోడు ఆమె పాత్ర మొత్తం సైన్ లాంగ్వేజ్ తోనే గడిచిపోయింది. కాబట్టి అనుష్క గురించి ఈ సినిమా చూస్తే బాగా నిరాశే. మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్‌సన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలని అద్బుతం చేయలేదు కానీ తమదైన నట న్యాయం చేశారు. ఎంతో బిల్డప్ గా పబ్లిసిటీ చేసిన హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్‌సన్ పాత్ర, నటన మనకు ఏమీ అనిపించదు. 
 

ఫైనల్ థాట్
 
 హాంటెడ్ హౌస్ కు వెళ్లిన కథ ఎప్పటిలాగే మర్డరైంది
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2 /5

 

ఎవరెవరు..
 

బ్యాన‌ర్స్‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

న‌టీన‌టులు: అనుష్క‌, మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలినిపాండే, సుబ్బరాజ్‌, మైకేల్ మ్యాడ్సన్‌,  అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు
సంగీతం:  గోపీ సుంద‌ర్‌
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌:  గిరీష్‌.జి
సినిమాటోగ్రఫీ:  షానియ‌ల్ డియో
ఎడిటింగ్‌: ప‌్రవీణ్ పూడి
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌:  కోన‌వెంక‌ట్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల
నిర్మాత‌:  టీజీ విశ్వప్రసాద్‌
క‌థ‌, ద‌ర్శక‌త్వం:  హేమంత్ మ‌ధుక‌ర్‌
ఓటీటి‌:  అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుద‌ల తేది: అక్టోబ‌ర్ 2

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios