త్వరలో తల్లికాబోతున్న అనుష్క శర్మ ఆనందంతో ఉబ్బితబ్బవుతోంది. తన ఆనందాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అనుష్క బ్లాక్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలకు పోజిచ్చారు. బేబీ బంప్ తో బికినిలో ఉన్న అనుష్క ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ ఆ ఫోటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. 

అనుష్క శర్మ కొద్దిరోజుల క్రితం తాను గర్భవతి అన్న సంగతి భయపెట్టారు.  మేము ముగ్గురం కాబోతున్నాం అని చెప్పారు. జనవరిలో నెలలో అనుష్క పండంటి బిడ్డకు జన్మను ఇవ్వనుంది. అనుష్క తల్లి కాబోతుందన్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానాలు అభినందనలు చెప్పారు. అనుష్క పోస్ట్ కి మిలియన్స్ లో లైక్స్, లక్షలలో కామెంట్స్ దక్కాయి. 

2018లో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన జీరో మూవీలో నటించిన అనుష్క 2019లో ఒక్క చిత్రం కూడా చేయలేదు. 2020లో విడుదలైన అంగ్రేజీ మీడియం మూవీలో అనుష్క క్యామియో రోల్ చేశారు.  ఇక నిర్మాతగా అనుష్క రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు. కాగా భర్త విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్ కావడంతో బిజీ అయిపోయారు.