ఇటీవల కాలంలో సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్న సంఘటనలు తరుచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లకు సంబంధించిన సినిమాలు, నిర్మాణ సంస్థలు లాంటి వాటి కారణంగా వారు తరుచూ ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇలాంటి ఇబ్బందుల్లోనే పడింది. ఆమె సహ  నిర్మాతగా వ్యవహరించిన ఓ వెబ్‌ సిరీస్‌లో అభ్యంతరకర డైలాగ్స్‌ ఉండటం వల్ల అనుష్క కూడా వివాదంలో చిక్కుకుంది.

అసలు విషయంలోకి వస్తే.. లాయర్స్‌ గిల్డ్‌లో మెంబర్‌గా వ్యవహరిస్తున్న విరేన్‌ శ్రీ గురుంగ్    అనే వ్యక్తి అనుష్క లీగల్‌ నోటీసులు పంపాడు. అనుష్క శర్మ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌లో ఉన్న పాతాల్‌ లోక్‌ అనే వెబ్ సిరీస్‌లో జాతీ వివక్ష వ్యాఖ్యలు ఉన్నాయన్న కారణంతో ఆయన ఈ నోటీసలు ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఈ షోలో ఓ నేపాలి పాత్రదారిని మహిళా పోలీసు అధికారి ఇంటారాగేట్ చేసే సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయన ఆరోపించారు. అనుష్క పోరాపాటు లేకపోయినా ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆమెకు నోటీసలు జారీ చేసినట్టుగా చెప్పారు.

గతంలోనూ ఈ కార్యక్రమంపై విమర్షలు వినిపించాయి. భారతీయ గోరఖ్స్‌ యువ పరిసంగ్‌ సభ్యులు షోలో లైంగిక దాడులుకు సంబంధించి అభ్యంతరకర డైలాగ్స్‌ ఉన్నట్టుగా ఆరోపించారు. అంతేకాదు ఆ సన్నివేశాలను మ్యూట్‌ చేయాల్సిందిగా వారు ఆన్‌లైన్‌ కంప్లయింట్ కూడా ఇచ్చారు. వారు తమ పిటీషన్‌ను ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్ కాస్ట్ మినిస్టర్‌ ప్రకాష్ జవదేకర్‌కు పంపించారు. ఇప్పుడు అదే సన్నివేశంపై విరేన్ శ్రీ గురుంగ్‌ కూడా చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేశారు.