Asianet News TeluguAsianet News Telugu

అనుష్క కుటుంబంతో ఆ మాజీ డాన్‌కి సంబంధాలు..!


మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) ఇటీవల కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడంతో ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రాత్రి 2.30 గంటల సమయంలో మరణించాడు. ఆయన  ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం. 

Anushka Family In Grief Over Underworld Don Death
Author
Hyderabad, First Published May 17, 2020, 6:26 PM IST


మాజీ అండర్ వరల్డ్ డాన్, సోషల్ యాక్టివిస్ట్ ముతప్ప రాయ్(68) ఇటీవల కన్నుమూశాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. గత ఏడాదిగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ముతప్ప.. ఆరోగ్యం మరింత విషమించడంతో ఓల్డ్ ఎయిర్ పోర్టు రోడ్డులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ రాత్రి 2.30 గంటల సమయంలో మరణించాడు. ఆయన  ప్రముఖ నటి అనుష్క శెట్టి ఫ్యామిలీకి సమీప బంధువని సమాచారం. దాంతో ఇప్పుడు అనుష్క కుటుంబం అంతా తీవ్ర విషాదంలో మునిగినట్లు తెలుస్తోంది. ఆ మధ్యన అనుష్క దేశ వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు వెళ్లగా.. అక్కడ ఈ భామ వెంట రాయ్‌ కూడా ఉన్నారు.  

 దక్షిణ కన్నడ పుత్తూరు పట్టణంలో తులు మాట్లాడే బంట్ కుటుంబంలో రాయ్ జన్మించాడు.  కాగా ఓ సాధారణ బ్యాంక్‌ ఉద్యోగిగా మొదలైన రాయ్‌ ప్రస్థానం అండర్‌ వరల్డ్ డాన్ వరకు సాగింది. చాలా చిన్న వయస్సులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల పాటు బెంగళూరు అండల్‌ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఈయన ఏలారు. ఆ తరువాత దుబాయ్‌లో తలదాచుకోగా.. 2000లో ఆ దేశం భారత్‌కు అప్పగించింది. హత్య, కుట్రకు సంబంధించి 8 క్రిమినల్ కేసుల్లో కర్ణాటక పోలీసులు ముతప్పకు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 2002లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారతదేశానికి రాయ్ వచ్చాడు. ఇండియాకు వచ్చినవెంటనే కన్నడ పోలీసులతోపాటు సీబీఐ సహా దర్యాప్తు బృందాలు ముతప్పను పలు కోణాల్లో విచారించాయి. 

ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్దోషిగా ప్రకటించారు. ‘జయ కర్ణాటక’ పేరుతో చారిటబుల్ సంస్థను రాయ్ స్థాపించాడు. 2011లో విడుదలైన తులు చిత్రం ‘Kanchilda Baale'లో రాయ్ నటించారు. ఆ తర్వాత 2012లో వచ్చిన Katari Veera Surasundarangi కన్నడ చిత్రంలో కూడా రాయ్ నటించాడు.  ముతప్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

 ఆ తరువాత  అండర్ వలల్డ్  కి దూరంగా ఉండాలని భావించిన రాయ్‌.. కర్ణాటక అనే ఎన్జీవోను ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు సహాయం చేశారు. ఇక వీరప్పన్ సినిమా తీసే సమయంలో.. వర్మకు రాయ్‌ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియగా.. ఆయనపై మూవీ తీయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఇందులో ప్రధాన పాత్రాధారుడిగా వివేక్ ఒబెరాయ్‌ పేరును అనౌన్స్ చేశారు. కారణాలు తెలీవు కానీ...ఈ సినిమా ముందుకు వెళ్లలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios