బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడంటూ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి డిమాండ్ చేస్తున్నారు. నటి కంగనా రనౌత్ కూడా పాయల్ ఘోష్ కి మద్ధతు తెలుపుతూ 'మీ టూ' 'అరెస్ట్ అనురాగ్ కశ్యప్' అంటూ ట్వీట్ పెట్టింది. ఈ నేపధ్యంలో ఆయన దగ్గర గతంలో గులాల్ టైమ్ లో  పనిచేసిన అసెస్టెంట్ జయదీప్ సర్కార్  ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ఆయనేంటి అనేది చెప్పే ప్రయత్నం చేసారు.

"ఈ విషయం చెప్పటానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. 2004లో అనురాగ్ గులాల్ సినిమా చేసేటప్పుడు... నేను సెకండరీ కాస్టింగ్ చూస్తున్నాను. ఎంతో మంది నటులు వచ్చి కలుస్తున్నారు. అలా ఓ అమ్మాయి వచ్చి తాను ఎలాగైనా అనురాగ్ ని కలవాలని ఆయన సినిమాలో వేషం చేయాలని అంది ."
 
 " అనురాగ్ నేరేషన్ పూర్తి చేసుకుని వచ్చి ఆమెను కలిసారు. ఆమె ఉద్దేశ్యం వేరే ఉంది. కాస్టింగ్ కౌచ్ ద్వారానే వేషం సంపాదించాలనుకుంది. ఆ అర్దం వచ్చేలా కొన్ని ఫేవర్స్ చేస్తా అంటూ మాట్లాడింది.  

"కానీ అనురాగ్..మర్యాదగా తిరస్కరించారు. ఈ లోగా ఆమె తన శారీ కొంగును జారవిడిచింది. వెంటనే అనురాగ్ లేచి ఇంకెప్పుడూ అలాంటివి చేయవద్దు అని చెప్పారు. తను స్క్రిప్టు లో ఆమెకు పనికొచ్చే పాత్ర ఉంటే ఖచ్చితంగా ఆమెకే ఇస్తానని..అంతేకాని ఇలాంటి వాటివల్ల ఉపయోగం లేదని చెప్పారు. అలా చెప్పేసి, బయిటకు వచ్చేసారు బాధపడ్డారు."

"ఇదంతా చూసిన నేను షాక్ అయ్యాను, అయితే ఆ సమయంలో ఆయనలో ఓ హీరో కనపడ్డారు. ఆమెపై సానుభూతి, జాలీ చూపించారు. తర్వాత మాట్లాడుతూ చాలా మంది అమ్మాయిలు ఇదే కరెక్ట్ దారి అనుకుంటున్నారు అని చెప్పి ఆవేదన చెందారు," అంటూ రాసుకొచ్చారు.
 
ఇదే విధంగా  ఇండస్ట్రీలోని మరికొందరు అనురాగ్ కశ్యప్ కి సపోర్ట్ నిలుస్తున్నారు.ఇప్పటికే హీరోయిన్ రాధికా ఆప్టే అనురాగ్ కుమద్దతు తెలుపగా ఆతర్వాత తాప్సి మాట్లాడుతూ అనురాగ్ కశ్యప్ పై ఆ రోపణలు నిజం కాదని నేను భావిస్తున్నాను అంది. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అనురాగ్ కు మద్దతుగా ట్వీట్ చేసారు