రాంచరణ్-బోయపాటి కాంబినేషన్‌లో కొత్త సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ మొదలయ్యేదాకా హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు. తొలి నుంచి అను ఇమ్మాన్యుయేల్ పేరే ఎక్కువగా వినిపించగా.. అనూహ్యంగా కైరా అద్వానీ ఈ అవకాశాన్ని ఎగరేసుకుపోయింది.

 

నిజానికి కైరా కంటే అనుకే క్రేజ్ ఎక్కువ. ఈ సినిమాతో తన కెరీర్ మరింత స్పీడ్ అందుకుంటుందని అనుఇమ్మాన్యుయేల్ కూడా భావించింది. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్‌తో దెబ్బకు ఈక్వెషన్లు మారిపోయాయి. అజ్ఞాతవాసి డిజాస్టర్‌గా మిగిలిపోవడం వల్లే సెంటిమెంట్ ను బలంగా నమ్మే టాలీవుడ్ ఫిలిం మేకర్స్ నిర్ణయంతో అను ఈ ఛాన్స్ మిస్ అయిందంటున్నారు.

 

ప్రస్తుతం మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్న కైరా.. తదుపరి సినిమా కూడా పెద్ద హీరోతోనే దక్కించుకోవడం, అది కూడా మెగా హీరోతో కావటం విశేషం. రాంచ‌రణ్ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా హీరోయిన్ గా కైరానే ఫిక్స్ చేశారు. మెగా కాంపౌండ్ లో పడితే అవకాశాలకు కొదువ వుండదన్నది రుజువైన నేపథ్యంలో కైరా అద్వానీకి గనుక అదృష్టం కలిసొస్తే భవిష్యత్తులో మరిన్ని పెద్ద ఆఫర్స్ వెంట వెంటనే ఆమె చేతిలో పడటం ఖాయం.

 

ఇక రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో గతంలోనే సినిమా రావాల్సి ఉన్నా చాలా ఆలస్యమే జరిగింది. నేటితో షూటింగ్ ప్రారంభించుకుంది.