అమెరికా వెళ్లాలంటే.. ఈ హీరోయిన్ ను ప్రిఫర్ చేస్తున్నారట!

anu emmanuel's us connection bringing her more offers
Highlights

అమెరికా సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాకు వెళ్లాలనుకునే హీరోయిన్లను అధికారులు ఎక్కువగా ప్రశ్నించడం వంటివి జరుగుతున్నాయి. అను ఇమ్మానుయేల్ అక్కడ సిటిజన్ కావడంతో ఆమె ఎక్కడికైనా ప్రయాణించవచ్చు

అను ఇమ్మానుయేల్ తెలుగులో 'మజ్ను' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అందంతో మాస్ ఆడియన్స్ ను సైతం ఎట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్య సరసన 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేరళకు చెందిన అను ఇమ్మానుయేల్ అమెరికాలో పుట్టింది. డల్లాస్, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పెరిగిన అను ఇమ్మానుయేల్ అమెరికా సిటిజన్. ఇప్పుడు ఆ అంశమే దర్శకనిర్మాతలు ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేలా చేస్తోందని సమాచారం. అమెరికా, యూరోప్ దేశాల్లో షూటింగ్ చేయాలనుకునే సినిమాల్లో హీరోయిన్ గా అనుని ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ కారణంగానే రవితేజ-శ్రీనువైట్ల సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎన్నుకున్నారు.

కానీ డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అమెరికా సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాకు వెళ్లాలనుకునే హీరోయిన్లను అధికారులు ఎక్కువగా ప్రశ్నించడం వంటివి జరుగుతున్నాయి. అను ఇమ్మానుయేల్ అక్కడ సిటిజన్ కావడంతో ఆమె ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలానే ఆడియన్స్ లో ఆమె పట్ల క్రేజ్ కూడా ఉంది. దీంతో అమెరికా, యూరోప్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయాలనుకునేవారు ఆమెనే హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారని టాక్. 

loader