అయ్యా.. శంకర్ మరో వంద కోట్లా?

Another 100 crores budget for Robo 2.0
Highlights

2.0 కోసం మరో 100కోట్లా?

రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘2.ఓ’. శంకర్‌ దర్శకుడు. అమీ జాక్సన్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. 2010 సూపర్‌ హిట్‌ ‘రోబో’కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ఇది. ఇండియన్ సినిమా హిస్టరీలో అతిపెద్ద సినిమాగా చెప్పుకుంటున్న 2.0 ఇంకా విడుదలకు నోచుకోకపోవడంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. షూటింగ్ పూర్తయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. గ్రాఫిక్స్ పనుల కోసం సినిమాకు సమయం ఎక్కువ పడుతుందని అందరికి తెలుసు. కానీ ఆర్నెళ్ళల్లో పూర్తి కావల్సిని పనులు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది. దర్శకుడు శంకర్ సినిమా కరెక్ట్ గా వచ్చే వరకు పట్టు వదలడం లేదు.

అయితే వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ పనులు పూర్తి కాని కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. నిజానికి 2017 దీపావళికి దీన్ని విడుదల చేయాలని భావించారు. కానీ కుదరకపోవడంతో.. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

తన సినిమా అన్ని కోణాల్లోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకునే దర్శకుడు శంకర్‌. దీంతో రాజీపడకుండా చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుతున్నారట. ఈ నేపథ్యంలో నిర్మాతలపై మరింత భారం పడిందట. చిత్ర నిర్మాణానికి రూ.400 కోట్లు కాకుండా అదనంగా రూ.100 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.
 

loader