అనుమతి లేని ఒక కంపెనీకి ప్రచారాలు చేస్తున్నారంటూ నటి అంజలిపై పిర్యాదు నమోదైంది. టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి గత కొన్ని రోజులుగా ఒక వంట నూనె కంపెనీకి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ విషయంపై  కోవైకి చెందిన వ్యక్తి అంజలిపై ఆరోపణలు చేశారు.   కోవై సుడర్‌పార్వై మక్కళ్‌ ఇయక్కం అధ్యక్షుడు సత్యగాంధీ గురువారం ఆహార భద్రత శాఖ అధికారులకు  పిర్యాదు చేశారు. ఒక హీరోయిన్ గా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి ఇలా మోసపూరిత ప్రచారాల్లో భాగం కావడం కరెక్ట్ కాదని అలాగే ఆ వంట నూనె ప్రజల ఆరోగ్యానికి మంచికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీలైనంత త్వరగా ఆ వంట నూనె కంపెనీపై చర్యలు తీసుకొవాలని అధికారులను కోరారు. అంజలి ప్రచారాలు నిర్వహించిన ఆ కంపెనీ ఈ–రోడ్డు ప్రధాన కార్యాలయంగా కొనసాగుతోంది.  అంజలిపై పిర్యాదు ,నమోదవడంతో ఒక్కసారిగా వార్త తమిళ మీడియాలో వైరల్ అయ్యింది. అంజలి ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో  కొన్ని సినిమాలు చేస్తోంది. త్వరలో తెలుగులో గీతాంజలి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.