Asianet News TeluguAsianet News Telugu

'ఆర్‌ఆర్‌ఆర్‌' తెర వెనక ఏం జరుగుతోందంటే?

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరో గా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది.  లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు  నాలుగు నెలల కీలక సమయం ఇప్పటికే వేస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అదేమిటంటే...ప్రస్తుతం ఈ సినిమాకి కావాల్సిన యానిమేషన్ వర్క్ పై పూర్తి దృష్టి పెట్టడం. 

Animation part to play a key role in RRR
Author
Hyderabad, First Published Jul 18, 2020, 8:16 AM IST

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి షూటింగ్‌లు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం  'ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రుధిరం రణం' కూడా ఒకటి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరో గా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది.  లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు  నాలుగు నెలల కీలక సమయం ఇప్పటికే వేస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అదేమిటంటే...ప్రస్తుతం ఈ సినిమాకి కావాల్సిన యానిమేషన్ వర్క్ పై పూర్తి దృష్టి పెట్టడం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమాలో యానిమేషన్ వర్క్ కు కావాల్సినంత ప్రాధాన్యత ఉంది. కొన్ని ఎపిసోడ్స్ ..యానిమేషన్ లోనే చెప్పబోతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం యానిమేషన్ నిపుణులు కొంతమంది ఆల్రెడీ పనిచేస్తున్నారు. ముఖ్యంగా కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల గురించి యానిమేషన్స్ లో వివరించబోతున్నారు. వారి నిజ జీవిత గాధలను యానిమేషన్ లో తెరకెక్కిస్తారు. 

అలాగే సినిమా క్లైమాక్స్ లో కూడా యానిమేషన్స్ భారిగా చోటు చేసుకోనున్నాయి. దాంతో ఈ కరోనా సమయాన్ని యానిమేషన్ వర్క్ కు రాజమౌళి అంకితం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కంటెంట్ ని విఎఫ్ ఎక్స్ స్టూడియోలకు గ్రాఫిక్ వర్క్ కోసం పంపి, ఫామ్ హౌస్ లో సేఫ్ గా ఉంటూ ఏ రోజుకా రోజు మానిటర్ చేస్తున్నట్లు సమాచారం. 
 
ఇక మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కావాల్సింది.  కానీ కరోనా దెబ్బ కొట్టింది . దాంతో  తాజాగా సంక్రాంతికి కూడా ఆర్ ఆర్ ఆర్ వచ్చేది కష్టమే అని నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. 30శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి పరిస్థితులలో పూర్తి చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనితో మరో నాలుగు నెలలు ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదాపడనుంది అని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ పుట్టినరోజు కానుకగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయగా అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios