హాట్ యాంకర్ అనసూయ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవు. ఆమె ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడంతో పాటు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ వెకేషన్  పిక్స్ అందుకు నిదర్శనం. ఎప్పుడూ షూటింగ్స్, ఈవెంట్స్, షోలతో బిజీగా ఉండే అనసూయ చిన్న విరామం ప్రకటించారు. ఆమె...  భర్త పిల్లలితో కలిసి ఆరావళి పర్వతాలకు ట్రిప్ కి వెళ్లారు. అందమైన నేచర్ ని అనుభవిస్తున్న అనసూయ, అక్కడ హద్దులు లేని ఆనందం పొందుతున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన ట్రిప్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 

తాజాగా నైట్ డిన్నర్ లో అనసూయ ముక్కాలా ముక్కాబులా సాంగ్ కి సెక్సీ స్టెప్స్ తో రచ్చ చేశారు. షార్ట్ జీన్స్, టీ షర్ట్ ధరించిన అనసూయ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అనసూయ తన ఇద్దరు కొడుకులను గైడ్ చేస్తూ స్టెప్స్ వేశారు. అమ్మ అనసూయతో పాటు ఇద్దరు పిల్లలు కలిసి ప్రభుదేవా ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ముక్కాలా ముక్కాబులా సాంగ్ కి డాన్స్ వేశారు. అనసూయ పోస్ట్ చేసిన డాన్స్ వీడియోపై నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక కెరీర్ పరంగా అనసూయ పీక్ స్టేజ్ లో ఉన్నారు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకువెళుతున్నారు. జబర్ధస్త్ షోతో పాటు అనేక బుల్లితెర షోలకు యాంకర్ గా ఉన్న అనసూయ, నటిగా కూడా రాణిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో  సినిమాలు తెరకెక్కుతున్నాయి. థ్యాంక్ యూ బ్రదర్ మూవీలో అనసూయ ప్రధాన పాత్ర చేస్తున్నారు. అలాగే సిల్క్ స్మిత బయో పిక్ లో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఇక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు.