నూతన సంవత్సరం సందర్భంగా యాంకర్ అనసూయ 'ఆస్క్ అనసూయ' అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనసూయ చాతిపై చిన్న టాటూ ఒకటి కనిపిస్తుంటుంది.

అసలు ఆ టాటూ అర్ధం ఏంటనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి అనిపించింది. అందుకే ఓ అభిమాని నేరుగా అనసూయని ఈ ప్రశ్న అడిగాడు. దీనికి అనసూయ సమాధానమిస్తూ.. ''దాని పేరు నిక్కు. నా భర్త ముద్దు పేరు'' అని వెల్లడించింది.

అలాగే మరో అభిమాని ''మీ మొదటి జీతం లేదంటే పారితోషికం ఎంత..?'' అని ప్రశ్నించారు. తన తొలి జీతం 5,500 అని అనసూయ సమాధానమిచ్చింది. అలానే అభిమానులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు చెప్పింది.

బుల్లితెరపై టాప్ యాంకర్ గా వెలుగొందుతోన్న ఈ బ్యూటీకి 'రంగస్థలం' సినిమాతో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఈ సినిమా తరువాత అందరూ ఆమెని రంగమ్మత్త అని పిలవడం మొదలుపెట్టారు.