టాలీవుడ్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ గ్లామర్‌ పాత్రల్లో అలవోకగా నప్పుతుంది. అందులో భాగంగానే ఆమె ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ శృంగార నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత బయోపిక్‌లో నటిస్తుందనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టే అనసూయ అద్దంలో త‌న ముఖాన్ని చూసుకుంటున్న‌ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పంచుకుని, తమిళంలో కొత్త ఆరంభం, సిల్క్ స్మిత పేరుని మెన్షన్‌ చేసింది. దీంతో అంతా సిల్క్ స్మిత బయోపిక్‌లో అనసూయ నటిస్తుందని అనుకున్నారు. సోషల్‌ మీడియా మొత్తం ఈ వార్త వైరల్‌ అయ్యింది. దీంతో మీడియాకి ఈ వార్త ఎక్కింది. 

తాజాగా దీనిపై అనసూయ స్పందించింది. తాను సిల్క్ స్మిత పేరుతో తెరకెక్కుతున్న ఎలాంటి బయోపిక్‌లోనూ నటించడం లేదని వెల్లడించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది. అయితే తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి నటించే సినిమాలో ఆమె సిల్క్ స్మిత తరహాలో సాగే పాత్ర అని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాను రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ తెలుగులో చిరంజీవి `ఆచార్య`, అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా 'రంగ‌మార్తాండ', ర‌వితేజ 'ఖిలాడీ' చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తుంది.