Asianet News TeluguAsianet News Telugu

మరో దారి వెతకండి.. ఆన్‌లైన్‌పై అనసూయ ఫైర్‌!

పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించటంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి పిల్లలు సెల్‌ ఫోన్‌ ల్యాప్ టాప్‌ స్క్రీన్‌ లు చూస్తూ ఉంటే వారి కళ్లు పాడవుతాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Anasuya Bharadwaj reaction on online classes during corona effected period
Author
Hyderabad, First Published Jun 14, 2020, 1:11 PM IST

కరోనా మహమ్మారి మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేసింది ప్రజలు గడపదాటి బయట అడుగు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. ఇక వృద్దులు, పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారు స్పేచ్ఛగా బయటికి వచ్చే రోజు ఎప్పుడు వస్తుందో ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. దీంతో విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులు వస్తాయని భావిస్తున్నారు.

ఇప్పటికే పలు పాఠశాలలు పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలు పెట్టాయి. ప్రభుత్వం ఆగస్టు నుంచి స్కూల్స్ ప్రారంభించాలని చూస్తున్నా.. అది సాధ్యపడేలా కనిపించటం లేదు. దీంతో మరికొంత కాలం ఆన్‌లైన్‌ క్లాసులు తప్పేలా లేవు. అయితే ఆ నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల తరబడి పిల్లలు సెల్‌ ఫోన్‌ ల్యాప్ టాప్‌ స్క్రీన్‌ లు చూస్తూ ఉంటే వారి కళ్లు పాడవుతాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన ట్విటర్ పేజ్‌లో `పేరెంట్‌ గా నాకొక్కదానికి ఇలా భయం కలుగుతుందా..? చిన్న వయసులో 5, 6 గంటల పాటు కంటిన్యూస్‌గా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే స్క్రీన్స్‌ చూస్తూ ఉంటే కళ్లు పాడవవా..? మనం 10 లోపు పిల్లల చదువు కోసం కొత్త మార్గం అన్వేషించాలి` అంటూ తన ఆవేదనను భయాన్ని వ్యక్తం చేసింది. అనసూయ చేసిన ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios