బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే  సడె న్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అల్లు అర్జున్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.. షోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ అనన్య చేసిన డాన్స్ ఏంటీ..?  ఎందుకు.. ఎక్కడ చేసింది..? 

అనన్య పాండే ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పెద్దగా పరిచయం అవసరం అక్కర్లేని పేరు. విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తోంది బ్యూటీ. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ స్టార్ బ్యూటీ. ఇక రీసెంట్ గా అనన్య సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. 

సోషల్ మీడియాలో దాదాపు 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న అనన్య హాట్ హాట్ ఫోటోస్ తో అదరిపోయేలా అందాల విందు చేస్తుంది. అంతే కాదు అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ కూడా చేస్తుంది అనన్య. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాకు వెళ్లి దుమ్ము రేపిన పుష్ప సినిమా పాటకు అదిరిపోయేలా స్టెప్పులేసింది అనన్య. సామి సామి పాటకు అచ్చం రష్మిక మాదిగా స్టెప్ వేసి సందడి చేసింది. 

Scroll to load tweet…

శ‌నివారం రాత్రి ఐఫా 2022 అవార్డ్స్ వేడుక‌ల్లో బాలీవుడ్ భామ సారా అలీఖాన్ త‌న స్నేహితుల‌తో క‌లిసి సంద‌డి చేసింది. ఈ గ్యాంగ్‌లో అన‌న్య‌పాండే కూడా ఉంది. ఈవెంట్ పూర్త‌యిన త‌ర్వాత‌ అనన్య‌పాండే అబుదాబిలోని ఓ హోట‌ల్ రూంలో హడావిడి చేసింది. పుష్పలోని సామి సామి పాట సిగ్నేచ‌ర్ స్టెప్పు వేసి..అద‌ర‌హో అనిపించింది.ఈ వీడియోను సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ త‌ర్వాత నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఈ వీడియోను రీపోస్ట్ చేసింది. ఇపుడీ వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనన్య పాండే డాన్స్ చేయడం.. అది కూడా పుష్ప సినిమాలో సిగ్నేచర్ స్టెప్ చేయడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అంతే కాదు పుష్ప రిలీజ్ అయ్యి అయిదారు నెలలు అవుతున్నా.. ఇంకా ఈ మూవీ క్రేజ్ తగ్గకపోవడం.. అది కూడా బాలీవుడ్ లో ఈ సినిమా క్రేజ్ కు ఇది ఎక్జాంపుల్ గా నిలవడంతో.. బన్నీ ఫ్యాన్స్ కూడా అది మా అల్లు అర్జున్ అంటే.. అంటున్నారు..