Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్!

గతేడాదిలో దీపికా పదుకొన్, ప్రియాంక చోప్రా ఇలా చాలా మంది హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఏడాదిలో కూడా కొందరు నటీమణులు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. 

Amy Jackson Gets Engaged!
Author
Hyderabad, First Published Jan 2, 2019, 10:27 AM IST

గతేడాదిలో దీపికా పదుకొన్, ప్రియాంక చోప్రా ఇలా చాలా మంది హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. ఈ ఏడాదిలో కూడా కొందరు నటీమణులు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా ఈ ఏడాది పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. 

మరో హాట్ హీరోయిన్ అమీజాక్సన్ కూడా తన ప్రియుడిని పెళ్లాడబోతుందని సమాచారం. తాజాగా ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటో బట్టి అమీకి నిశ్చితార్ధం జరిగిందనే నిర్ధారణకి వచ్చేశారు అభిమానులు.

''జనవరి 1, 2019.. అడ్వెంచర్ లైఫ్ ని మొదలుపెట్టబోతున్నాం.. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. నాకు ఎంతో సంతోషాన్ని పంచే నీకు ధన్యవాదాలు'' అంటూ అమీ తన ప్రియుడు జార్జ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటోలో అమీ చేతికి డైమండ్ రింగ్ ఉండడం, అలానే తన బాయ్ ఫ్రెండ్ ఆమెని ముద్దు పెడుతూ కనిపించడంతో ఈ జంటకి ఎంగేజ్మెంట్ జరిగిందని అంటున్నారు. కొద్దిరోజుల పాటు తమ రిలేషన్షిప్ గురించి ఎలాంటి కామెంట్ చేయకుండా అభిమానులతో దోబూచులాడిన అమీ ఎట్టకేలకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios