అమితాబ్ 'గులాబో సితాబో' రివ్యూ

ఓటీటి సినిమాలు అంటే క్రైమ్, సస్పెన్స్ , హారర్, థ్రిల్లర్ ఇవేమీ కాకపోతే అడల్ట్ అన్నట్లుగా వస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో తయారై ఓటీటిలో రిలీజ్ అవుతున్న వాటిల్లో ఎక్కువ శాతం బి గ్రేడ్ సినిమాల లాగ ఉంటున్నాయనటంలో అతిశయోక్తి లేదు. జనం కూడా అందుకు తగినట్లుగానే థియోటర్ రిలీజ్ లేదు కాబట్టి , ఏదో ఒకటి చూడాలనుకుంటూ కర్సర్ ని ముందుకు తోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఆ తరహా సినిమాల కంటెంట్ కు భిన్నంగా ఉంటూ, కామెడీ జానర్ లో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్స్ ని వెంటేసుకుని ఈ సినిమా ఓటీటీకు వచ్చింది. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా..అమితాబ్ వెరైటి గెటప్ వెనక కథేంటి...అసలు సినిమాలో పాయింట్ ఏమిటి, టైమ్ ఖర్చు పెట్టి చూస్తే గిట్టుబాటు అయ్యే వ్యవహారమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Amitabh Bachchan Gulabo Sitabo Review

ఓటీటి సినిమాలు అంటే క్రైమ్,సస్పెన్స్ , హారర్, థ్రిల్లర్ ఇవేమీ కాకపోతే అడల్ట్ అన్నట్లుగా వస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో తయారై ఓటీటిలో రిలీజ్ అవుతున్న వాటిల్లో ఎక్కువ శాతం బి గ్రేడ్ సినిమాలులాగ ఉంటున్నాయనటంలో అతిశయోక్తి లేదు. జనం కూడా అందుకు తగినట్లుగానే థియోటర్ రిలీజ్ లేదు కాబట్టి , ఏదో ఒకటి చూడాలనుకుంటూ కర్శర్ ని ముందుకు తోస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఆ తరహా సినిమాల కంటెంట్ కు భిన్నంగా ఉంటూ, కామెడీ జానర్ లో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా వంటి స్టార్స్ ని వెంటేసుకుని ఈ సినిమా ఓటీటికు వచ్చింది. మరి ఈ సినిమా అయినా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా..అమితాబ్ వెరైటి గెటప్ వెనక కథేంటి...అసలు సినిమాలో పాయింట్ ఏమిటి, టైమ్ ఖర్చు పెట్టి చూస్తే గిట్టుబాటు అయ్యే వ్యవహారమేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి:
లక్నోలోని అతి పురాతన హవేలి ఫాతిమా మహల్‌లో అనేక లో మిడిల్ క్లాస్ కుటుంబాలు చాలా కాలంగా అద్దెకు ఉంటూంటారు. పేరుకు అద్దే కానీ అంతా కలిపితే ఎంతో ఉండదు. ఇక ఈ హవేలి ఓనర్ బేగమ్‌(ఫరూక్‌ జఫర్‌) అనే ముసలామె. ఆమెను ఆ రోజుల్లో ఈ ప్యాలెస్ మీద ప్రేమతో తన కన్నా పదిహేనేళ్లు పెద్దైన ఆమెను మీర్జా షేక్‌ (అమితాబ్‌ బచ్చన్‌)  పెళ్లి చేసుకుంటాడు. అప్పటినుంచీ ఆమె పై లోక యాత్రకు ప్రయాణం కట్టుకుంటే తాను మాలిక్ (యజమాని)అవ్వచ్చు కదా అని మీర్జా ఎదురుచూస్తూ..చూస్తూ..చూస్తూ ముసలాడైపోతాడు. అతని ఏకైక జీవితాశయం..చచ్చేలోగా ఆ భవంతి ఓనర్ అనిపించుకోవటం.ప్రస్తుత వ్యాపకం...అందులో అద్దెకుండే వాళ్ల నుంచి అద్దెలు వసూలు చేయటం. ఇలా తనదైన జీవితాశయంతో ప్రపంచంతో సంభందం లేకుండా బ్రతికేస్తున్న మీర్జాకు ఓ తలనొప్పి బాన్‌కీ(ఆయుష్మాన్‌ ఖురానా). ఆ ప్యాలెస్ లో చాలా ఏళ్లుగా అద్దెకుంటున్న బాన్ కీ అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు కానీ అద్దె కట్టడటంలో మాత్రం పెద్దాయనని ముప్పు తిప్పలు పెడుతూంటాడు. వీళ్లద్దిరి మధ్యా పిల్లా..ఎలుకా గేమ్ నడుస్తూంటుంది. 

ఇదిలా ఉంటే ఈ లోగా ఆర్కియాలజీ డిపార్టమెంట్ ఆఫీసర్  గ్యానేష్ శుక్లా(విజయ్ రాజ్) కన్ను ఈ భవంతిపై పడుతుంది.ఈ ప్యాలెస్ పురాతన కట్టడం కిందకు వస్తుందంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాడు. మరో ప్రక్క సిటీలో  ఓ ప్రాంతంలో 100 టన్నుల బంగారం పాతిపెట్టి ఉనట్టు కల వచ్చిందని ఓ బాబా చెప్పడంతో లక్నోలో అలజడి మొదలవుతుంది. ఆర్కియాలజీ సర్వే అధికారులు తవ్వకాలు చేపడుతారు. ఇక  లాయర్ క్రిస్టోఫర్(బ్రిజేంద్ర కాలా)సహాయంతో బిల్డింగ్ అమ్మే పనిలో పడతాడు మిర్జా. అలాగే పనిలో పనిగా బేగమ్‌ నుంచి పవర్‌ ఆఫ్‌ అటార్నీ తీసుకునేందుకు చేస్తూంటాడు. దాన్ని అడ్డుకునేందుకు బాంకే మిగిలిన అద్దెకున్న వాళ్లతో కలిసి స్కెచ్ లు  వేస్తుంటాడు. ఇక చివరకు ఫాతిమా మహల్‌ను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే సమయానికి బేగమ్‌ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి...ఇంతకీ మీర్జా ఆ బిల్డింగ్ ని అమ్మేయగలుగుతాడా...బంగారు నిధులకు, ఈ ప్యాలెస్ కి ఏమైనా లింక్  ఉందా? మిర్జా, బ్యాంకీ రాజీ పడ్డారా? చివరకు హవేలీ ఎవరికి దక్కింది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది:
వాస్తవానికి అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా వంటి ఆర్టిస్ట్ లు ఉన్న సినిమా అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. దానికి తోడు దర్శకుడు షూజిత్ సర్కార్ కావటంతో అవి పీక్స్ కు చేరాయి. అయితే ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. సినిమాలో ఫన్ ఉంది కాని పగలబడి నవ్వలేం. అలాగే ఫస్టాఫ్ లోనే ఆ ఫన్ కు శుభం కార్డు పడింది. సెకండాఫ్ లో ఫస్టాఫ్ లో ఉన్న జోష్ లేదు. ఎందుకంటే సెకండఫ్ లో పురావస్తు శాఖ అధికారులు, కోర్టు, లాయర్ల చుట్టు మిర్జా తీరిగే అంశాలతో బోర్ గా మారిపోయింది. దానికి తోడు కథలో ఎలాంటి కదలిక లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే సినిమా సాగుతున్నట్లు ఉంటుంది కానీ ఎక్కడా చోట ఆగి బలమైన ముద్ర వేయదు. క్యారక్టర్స్ ఉంటాయి కానీ వాటి మధ్య సరైన కాంప్లిక్ట్ కనిపించదు. అలాగే కథ ఆయుష్మాన్ ఖురానా తో వైరంతో మొదలై..ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది. దాంతో  క్యారక్టర్ ఫర్మామెన్స్, కాంప్లెక్స్ యాటిట్యూడ్ వల్ల  సినిమాకు కలిసొచ్చిందేమీ కనపడలేదు. 

కథ ఎక్కడ మొదలైందో అటే ప్రయాణం పెట్టుకుని...అందులోనే సబ్ ప్లాట్స్ ని వెతుక్కుని..అక్కడే ముగింపు కు వస్తే ఇంత ఇబ్బంది అనిపించేది కాదు. ఇది స్క్రిప్టు పరంగా విఫలయత్నం. నటీనటుల పరంగా అద్బుతయత్నం. అమితాబ్ తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారు. ఆయుష్మాన్ ఖురానా ఆయన ముందు తేలిపోతాడనుకున్నా...అంతలేదు అనిపించాడు. అయితే అతనికి సీన్స్ తక్కువరాసి అన్యాయం చేసారు. ఇక స్క్రీన్ ప్లే పరంగా ఎక్కువ ఆశపడితే ఎక్కువ నిరాశపడతావు అనేది చెప్పాలని ఆ దిసగా రాసుకున్నారు. అయితే ఈ కాలంలో ఇంకా ఇలాంటి నీతులు జనం చూస్తారా...ఏమో ఇంకొంత ఎఫెక్టివ్ గా చెప్తే ..ఇంకా బాగా నచ్చేదేమో...ఏదైమైనా కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు ఓల్డ్ స్కూల్ ని అనుసరిస్తూ ఆ తరహా కథనంతో చెప్పకుండా ఉంటేనే బెస్ట్.  అలాగే ఇలాంటి కథలకు ఎంతో కొంత ఎమోషన్ డెప్త్ లేకపోతే మనసుకు పట్టడం కష్టం.

టెక్నికల్ గా:
లక్నో సిటీ, అందులో ఆ పురానా హవేలి  కూడా కథలో ఓ భాగమే అన్నట్లుగా  స్క్రిప్టు రాసుకోవటం, అందుకు తగినట్లు కెమెరా వర్క్, చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ డైరక్షన్ ఇలా అన్ని విభాగాలు డైరక్టర్ తో పాటు కలిసి మెలిపి పనిచేసాయి. ఏది హైలెట్ కాలేదు. ఏదీ తక్కువగా లేదు. అయితే దర్శకుడుగా సూజిత్‌ సర్కార్‌...తన గత చిత్రాలు  ‘విక్కీ డోనర్‌’, ‘పీకూ’, ‘అక్టోబరు’ స్దాయి మాత్రం కనపడదు. నటీనటుల్లో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాలు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పోటీ పడి చేసారు.  అయితే వారికి కథ,కథనం కలిసి రాలేదు.  

ఫైనల్ థాట్
ఏంటో ఓటీటికు వచ్చేవాటిలో ఎక్కువ ఓటి కుండలే 

Rating:2.5

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios