Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ కు మళ్లీ అదే సమస్య..ఎందుకిలా జరుగుతోంది?

 మొదట ప్రభాస్ 20 చిత్రం ఎనౌన్స్ చేసినప్పుడు నిర్మాతలు అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడుగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ పేరుని వాడటం మానేసారు. రీసెంట్ గా ఈ చిత్రం అప్ డేట్ ఇస్తూ ఈ చిత్రం పీఆర్పో టీమ్ ..సినిమా క్రూ అందరిని ప్రస్తావిస్తూ కావాలనే సంగీత దర్శకుడు పేరుని స్కిప్ చేసారు. ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు తెర వెనుక ఏం జరిగిందీ అనే విషయం ఆరా తీస్తే..కొన్ని సంగతలు బయిటకు వచ్చి ఆశ్చర్యపోయేలా చేసాయి.

Amit Trivedi is not working for Prabhas20
Author
Hyderabad, First Published May 22, 2020, 4:13 PM IST

తాను ప్రబాస్ చిత్రానికి పనిచేయటం లేదని, అసలు సైన్ చేయలేదని ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది తేల్చి చెప్పారు. ఆయన సైరా, నాని చిత్రం వి తర్వాత ఏ తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదన్నారు. ప్రస్తుతం ఈ స్టార్ మ్యూజిక్ డైరక్టర్ బాలీవుడ్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అయితే మొదట ప్రభాస్ 20 చిత్రం ఎనౌన్స్ చేసినప్పుడు నిర్మాతలు అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడుగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ పేరుని వాడటం మానేసారు. రీసెంట్ గా ఈ చిత్రం అప్ డేట్ ఇస్తూ ఈ చిత్రం పీఆర్పో టీమ్ ..సినిమా క్రూ అందరిని ప్రస్తావిస్తూ కావాలనే సంగీత దర్శకుడు పేరుని స్కిప్ చేసారు. ఇది మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు తెర వెనుక ఏం జరిగిందీ అనే విషయం ఆరా తీస్తే..కొన్ని సంగతలు బయిటకు వచ్చి ఆశ్చర్యపోయేలా చేసాయి.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం హిందీ రైట్స్ ని టీ సీరిస్ వారు తీసుకున్నారు. టీసీరిస్ వారిది బాలీవుడ్ లో అతి పెద్ద మ్యూజిక్ కంపెనీ. వాళ్లు సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్స్ ని డిసైడ్ చేయటం అనేది మ్యూజిక్ రైట్స్ మొదలైన నాటి నుంచి మొదలెట్టారు. ఈ బాలీవుడ్ మ్యాజిక్ కంపెనీ రూల్ ప్రకారం..ఓ సినిమాకు అనేక మంది మ్యూజిక్ డైరక్టర్స్ ని పెట్టి, ఒక్కొక్కరికీ ఒక్కో పాట ఇవ్వటం. సాహోకు అదే స్కీమ్ ఫాలో చేసారు. ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి అదే చేయబోతున్నట్లు వినికిడి. 

అయితే ఇలాంటి స్కీమ్ లు అమిత్ త్రివేది వంటి స్టార్ మ్యూజిక్ డైరక్టర్స్ కు ఖచ్చితంగా నచ్చవు. చేస్తే సినిమా మొత్తం తనే చేయాలి..లేకపోతే లేదు అన్నట్లు ఉంటారు. ఈ నేపధ్యంలో అమిత్ త్రివేది తప్పుకున్నట్లు సమాచారం.   పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి  ఇప్పుడు కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుతున్నారట.. దర్శక నిర్మాతలు. 

ఇక  ప్రభాస్ గత సినిమా సాహో విషయంలో కూడా జరిగింది. సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న శంకర్, ఎహసాన్, లాయ్ లు మధ్యలో సినిమా వదిలేసి వెళ్లిపోయారు. సాహో నిర్మాతలు పూర్తి పాటలు కంఫోజ్ చేసే బాధ్యత వారికి ఇవ్వకపోవడంతో ఆ మ్యూజిక్ త్రయం ఈ నిర్ణయం తీసుకొని వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి ప్రభాస్ సినిమాకు ఇలానే జరగడం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు.  సినిమా వివారాల్లోకి వెళ్తే..జిల్  రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్  ఓ లవ్ స్టోరీ చేస్తోన్నాడు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు వరకూ జార్జియాలో జరిగింది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios