టీవీ ఇండస్ట్రీలో తనను బ్యాన్ చేశారని.. ఆ తర్వాతే తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టానని బాలీవుడ్ నటుడుడ అమిత్ సౌధ్ పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన మరణం తర్వాత.. ఒకరి తర్వాత మరొకరు తాము ఎదుర్కొన్న అనుభవాలను చెబుతూ వస్తున్నారు.

కాగా.. తాజాగా మరో నటుడు షాకింగ్ విషయాలు తెలియజేశారు.  ‘క్యూ హోతా హై ప్యార్’ అనే  టీవీ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన అమిత్.. ఈ సీరియల్‌తో చాలా పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత తనకు టీవీ ఇండస్ట్రీలో నిషేధించారని, పోన్‌లు చేసుకొని మరీ తనకు పని ఇవ్వొద్దని చెప్పుకునేవారని అమిత్ చెప్పాడు. 

కొన్ని నిజాలు బయటపెట్టినందుకే ఇండస్ట్రీ వాళ్లు తనను అలా వెలివేసినట్లు అతను తెలిపాడు. దీంతో టీవీ ఇండస్ట్రీలో తనకు పని లేకపోతే సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా.. సుశాంత్ తో కలిసి అమిత్ ఓ సినిమాలో నటించాడు. వీరిద్దరూ కలిసి నటించిన ‘కై పో చే’ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్‌గా నిలిచింది.