బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌, ఆయన భార్య, టెలివిజన్ నటి చారు అసోపాలకు సంబంధించిన వార్తలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. గత ఏడాది గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారన్న వార్తలు వైరల్‌ అయ్యాయి. రాజీవ్‌, చారులు తమ సోషల్ మీడియా పేజ్‌ల నుంచి పార్టనర్స్‌ ఫోటోలను డిలీట్ చేయటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టైంది.

కొద్ది రోజులు ఈ జంట విడి విడిగా ఉండటం కూడా ఈ వార్తలు మరింత వైరల్‌ అవ్వడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం రాజీవ్ ఢిల్లీలో ఉంటుండగా, చారు ముంబైలో ఉంటుంది. దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. ఈ వార్తలపై రాజీవ్‌, చారులు స్పందించకపోవటంతో రూమర్స్ మరింతగా సర్క్యులేట్‌ అయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్‌ సేన్‌.

తన భార్య చారుతో వీడియో కాల్‌ మాట్లాడిన స్క్రీన్‌ షాట్‌ను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు రాజీవ్‌. ఈ స్క్రీన్‌ షాట్‌తో తమ ఇద్దరి  మధ్య ఏం లేదని చెప్పకనే చెప్పాడు రాజీవ్‌. చారు, రాజీవ్‌లు గత ఏడాది జూన్‌లో గోవాల జరిగిన లావిష్‌ వెడ్డింగ్‌లో ఒక్కటయ్యారు. ఆ తరువాత తమ ఇంటిమేట్‌ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేసి విమర్శల పాలయ్యింది ఈ జంట.