ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌లను వాయిదా వేసారు. దాంతో  చాలా సినిమా ఇండస్ట్రీలు మూతపడ్డాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పూడు ఊహించని  పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ దెబ్బ తో చాలా రంగాల్లో పనిచేసే వారు ఖాళీగా ఉన్నారు.అయితే కొందరికి వారికి మాత్రం కరోనా వైరస్ పుణ్యమా అని కాసుల వర్షం కురుస్తోంది. 

ముఖ్యంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు కూడా మూతపడటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటీటీ ప్లాట్‌ఫాంలను తెగ ఎంకరేజ్ చేస్తున్నారు.  విద్యార్ధులు, ఉద్యోగులు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఎక్కడ విన్నా   అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్‌స్టార్ తదితర డిజిటల్ ప్లాట్‌ఫాంల పేర్లే వినపడుతున్నాయి. ఈ రంగం వారికి కాసుల వర్షం కురుస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంలోని సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా టాప్ ఓటీటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ తో ఓ స్టన్నింగ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 

ఆయన బ్యానర్ లో తీసిన దాదాపు 40 సినిమాలలో ఇరవై దాకా అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిందిట. బల్క్ గా మొత్తం సినిమాలను తమ యాప్ లో స్ట్రీమింగ్ కు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు పెద్ద మొత్తాన్నే దిల్ రాజు కు పే చేసిందని అంటున్నారు. దిల్ రాజు పాత సినిమాలకు ఇంత డిమాండ్ వస్తుందని ఊహించలేదని చెప్తున్నారు. దాంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారట. కరోనా టైమ్స్ లో కూడా ఆయన బాగా లాభపడ్డారన్నమాట.