Asianet News TeluguAsianet News Telugu

రొమాంటిక్‌ మ్యూజిక్‌ డ్రామాగా `బాండిష్ బాండిట్స్`

అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బారాత్) నిర్మాణం, రూపకల్పనలో ఆనంద్ తివారీ దర్శకత్వంలో  రూపుదిద్దు కు న్నఈ సరికొత్త అమెజాన్ ఒరిజినల్ సిరీస్ రెండు విభిన్న మ్యూజికల్ నేపథ్యాలకు చెందిన ఇద్దరు యువ ప్రదర్శకులకు సంబంధించిన కథ.

Amazon Prime announces new Indian original series Bandish Bandits
Author
Hyderabad, First Published Jul 13, 2020, 5:48 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాండిష్ బాండిట్స్ విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. 2020 ఆగస్టు 4 ఈ వెబ్‌ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారుజ. అమృత్ పాల్ సింగ్ బింద్రా (బ్యాంగ్ బాజా బారాత్) నిర్మాణం, రూపకల్పనలో ఆనంద్ తివారీ దర్శకత్వంలో  రూపుదిద్దు కు న్నఈ సరికొత్త అమెజాన్ ఒరిజినల్ సిరీస్ రెండు విభిన్న మ్యూజికల్ నేపథ్యాలకు చెందిన ఇద్దరు యువ ప్రదర్శకులకు సంబంధించిన కథ. ఈ పది భాగాల సిరీస్ లో రైజింగ్ టాలెంట్ రిత్విక్ భౌమిక్ (ధూసర్) హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడిగా, రాధేగా, శ్రేయా చౌదరి (డియర్ మాయా) పాప్ స్టార్ తమన్నాగా నటించారు.

వారితో పా టుగా నసీరుద్దీన్ షా ( ఎ వెడ్ నెస్ డే, ది లీగ్ ఆఫ్ ఎక్స్ ట్రార్డినరీ జెంటిల్ మ్యాన్), అతుల్ కుల్ కర్ణి (పేజ్ 3, రంగ్ దె బసంతి), కునాల్ రాయ్ కపూర్ (లవ్ పర్ స్వ్కేర్ ఫుట్, దిల్లీ బెల్లీ), షీబా చద్దా (మీర్జాపూర్, తలాష్), రాజేశ్ తైలంగ్ (మీర్జాపూర్, ది సెకండ్ బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్) తదితరులు ఇందులో నటించారు. బాండిష్ బాండిట్స్ ఉద్వేగభరిత ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను కూడా కలిగి ఉంది. లెజండరీ సంగీతత్రయం శంకర్-ఎసాన్-లోయ్ దీన్ని అందించారు. ఈ షో తో వీరు డిజిటల్ రంగప్రవేశం చేసినట్లయింది. బాండిష్ బాండిట్స్ 200 దేశాల్లో ఎక్స్ క్లూజివ్ గా ప్రైమ్ వీడియో పైనే విడుదల కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇండియా ఒరిజినల్స్ హెడ్ అపర్ణ పురోహిత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, `వైవిధ్య భరిత మరియు ప్రతిధ్వనించే కథలను చెప్పడంపై మేము ఆసక్తి కనబరుస్తున్నాం` అని అన్నారు. `బాండిష్ బాండిట్స్ అనేది భిన్న ప్రపంచాలు, సంప్రదాయాలు, సంగీత ఘరానాలలో చిక్కుకుపోయిన ఓ యువ జంట ఓ మ్యూజికల్ రొమాన్స్. ప్రైమ్ వీడియోకు సంబంధించి ఈ తరహాలో ఇదే మొదటిది. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ సభ్యులకు దీన్ని అందించడం మాకెంతో ఆనందదాయకం` అని అన్నారు.

ప్రొడ్యూసర్, క్రియేటర్ అమృత్ పాల్ సింగ్ బింద్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, `బాండిష్ బాండిట్స్ అనేది ని జమైన ప్రేమ ఆవేదన. ప్రపంవచవ్యాప్తంగా కూడా విశిష్టమైన ఒరిజినల్ కంటెంట్ ను అదించడంలో చాంపియన్ గా ఉన్న ప్రైమ్ వీడియో వంటి డైనమిక్, అంతర్జాతీయ సర్వీస్ ద్వారా దాన్ని తీసుకువస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం` అని అన్నారు. 

`భారతీయ సంప్రదాయాలు, విలువల మూలాల్లోకి ఈ షో అంశాలు బలంగా చొచ్చుకెళ్లాయి. ఇది ఆధునిక మ్యూజికల్ రొమాన్స్ అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయంగా వీక్షకులకు నచ్చుతుంది. ప్రతిభావంతులై న రిత్విక్ భౌమిక్, శ్రేయ చౌదరిల సారథ్యంలో ప్రేమ, తగాదాలు, అన్వేషణ ప్రయాణంలోకి ప్రైమ్ సభ్యులను తీసుకొని వెళ్లేందుకు మేమిక వేచిఉండలేం` అని అన్నారు.

`బాండిష్ బాండిట్స్ అనేది ఎంతో విభిన్నంగా ఉండే, అదే సమయంలో ఎన్నో పోలికలు ఉండే ఇద్దరు వ్యక్తులు మరియు రెండు సంస్కృతుల కలయికకు సంబంధించిన కథ` అని అన్నారు బాండిష్ బాండిట్స్ దర్శకులు ఆనంద్ తివారీ. `ప్రతీ క్యారెక్టర్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతీ పాత్ర తీరు కూడా సరైనదే అనిపిస్తుం టుంది. ఇది ఈ సిరీస్ ను ఎంతో శక్తివంతమైందిగా, రొమాంటిక్ గా, నిజజీవితానికి సంబంధించిందిగా చేసింది. తిరుగులేని అందమైన ప్రేమకథను సంగీత విద్వాంస త్రయం  శంకర్-ఎసాన్-లోయ్ ల సంగీతంతో ప్రైమ్ వీడియో ద్వారా మీకు అందించగలుగుతున్నందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను` అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios