సుకుమార్  సినిమా సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం. లాక్ డౌన్ పీరియడ్ లో అల్లు అర్జున్ వరసగా కథలు వింటున్నారు. తమ కెరీర్ కు సంభందించిన అనేక పనులు చేస్తున్నారు. ఓ ప్రక్కన బాడీ ఫిట్నెస్ తో పాటు...మిస్సైన ఈ సంవత్సరం రికవరీ అయ్యేలా వరస ప్రాజెక్టులకు రంగం సిద్దం చేస్తున్నారు. రోజువారీ వీడియో కాల్స్ తో బిజీగా ఉంటున్నట్లు సమాచారం. దాంతో బన్నితో సినిమా చెయ్యాలనుకున్న దర్శకులు మొదట అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని టచ్ లోకి వెళ్తున్నారు. పాయింట్ నచ్చితే స్క్రిప్టు మీద వర్క్ చేయమని బన్ని చెప్తున్నట్లు తెలుస్తోంది. అలా ఇప్పుడు ఇప్పుడు యాత్ర దర్శకుడు మహి వి రాఘవతో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేయబోతునట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం బట్టి మహి వి రాఘవ మొదట ఓ పొలిటికల్ థ్రిల్లర్ తో బన్నిని కలిసారు. స్టోరీ లైన్ వినగానే ఆయన ఇంప్రెస్ అయ్యి...స్క్రిప్టు మొత్తం చెప్పమని టైమ్ ఇచ్చి విన్నారట. అయితే తాను మొదటనుంచి పొలిటికల్ సబ్జెక్టులకు దూరం అని, కానీ ఈ సారి స్క్రిుప్టులో ఉన్న ఎలిమెంట్స్ చూసాక, రాజకీయ ప్రస్తావన తగ్గిస్తూ సినిమా చేద్దామని చెప్పారట. ఇక ఈ రోజు రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, ఫైనాన్స్ వ్యవహారాలపై ఓ సామాన్యుడు చేసే పోరాటం గా ఉంటుందని చెప్తున్నారు. మహి వి రాఘవ చాలా కాలంగా ఈ స్క్రిప్టుని రెడీ చేస్తున్నారట. ఇక ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. 
 
ఆనందో బ్రహ్మ,దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర నేపథ్యంలో  ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించిన మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో  ఈ చిత్రం రూపొందనుందడంటతో మంచి అంచనాలే ఉంటాయి.  ప్రస్తుతం బన్ని.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ అదిరిపోయింది.  ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో  నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసాడు దేవీశ్రీ ప్రసాద్.