Asianet News TeluguAsianet News Telugu

బన్నీ ఖాతాలో మరో రికార్డ్‌.. టాలీవుడ్‌లో టాప్‌!

బుట్ట బొమ్మ సాంగ్ వరుసగా రికార్డ్ లు బ్రేక్‌ చేస్తూ వెళ్తుంది. ఈ సాంగ్ టాలీవుడ్‌ చరిత్రలోనే అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది. దీంతో అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. బుట్ట బొమ్మ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డ్‌ ల వేట మొదలైంది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పుడు కూడా ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తోంది.

Allu Arjuns Buttabomma creates new record in tollywood
Author
Hyderabad, First Published Jul 12, 2020, 1:37 PM IST

ఈ ఇయర్‌ సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ సాధించిన బన్నీ తొలిసారిగా ఇండస్ట్రీ రికార్డ్‌ను కూడా అందుకున్నాడు. అయితే ఈ సినిమా థియెట్రికల్‌గా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో.. ఆడియో పరంగా అంతకు మించి విజయం సాదిచింది. సినిమా రిలీజ్‌ అయిన ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అల వైకుంఠపురములో పాటలో మారుమోగుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ వరుసగా రికార్డ్ లు బ్రేక్‌ చేస్తూ వెళ్తుంది. ఈ సాంగ్ టాలీవుడ్‌ చరిత్రలోనే అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది. దీంతో అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. బుట్ట బొమ్మ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డ్‌ ల వేట మొదలైంది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పుడు కూడా ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తోంది. 

తాజాగా ఈ పాట ఖాతాలో మరో క్రేజీ రికార్డ్‌ చేరింది.. యూట్యూబ్‌ లో రెండు మిలియన్ల(20 లక్షల)కు పైగా లైక్స్ వచ్చిన తొలి పాటగా రికార్డ్ సృష్టించింది బుట్టబొమ్మ. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న చిత్రయూనిట్‌, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios