తెలుగులో అందరి హీరోల దృష్టీ ప్యాన్ ఇండియా సినిమాలపై పడింది. తమ మార్కెట్ ని ఎక్సపెండ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రబాస్ బాహుబలి, సాహోతో హిందీ మార్కెట్ సంపాదించటంతో తమకూ అలాంటి హోదా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణా, ఆంధ్రా, కర్ణాటక, కేరళ మార్కెట్ లలో తనకంటూ స్దానం క్రియేట్ చేసుకున్న బన్ని ప్యాన్ ఇండియా చేసి అంతటా తన జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ముంబై వెళ్లి వస్తూ కొందరు దర్శకులతో చర్చలు జరుపుతూ, వారి కథలు వింటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. బాలీవుడ్ డైరక్టర్ అయితే ఖచ్చింతగా హిందీ మార్కెట్ ని ఆకట్టుకునే సినిమా అవుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నారు. అప్పుడు ఎలాగో తనకు మిగతా  భాషల్లో మార్కెట్ ఉంది కాబట్టి దాన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్లవచ్చని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే అట్లీతో ఓ తెలుగు, తమిళ సినిమా సైతం ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాసం ఉంది. ఈ లోగా హిందీ డైరక్టర్ తో సెట్ అయితే 2020 చివర్లో మొదలెట్టి 2021 వేసవికు భారీగా రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. ఇక అల్లు అర్జున్ ముందు చూపుతో కూడిన ప్లాన్ చూసి మిగతా హీరోలు తాము వెనక బడే అవకాసం ఉందని రియలైజ్ అవుతున్నారట. మరో ప్రక్క రామ్ చరణ్ ఇలాగే హిందీ డైరక్టర్ తో తుఫాన్ సినిమా చేసి దెబ్బ తిన్న విషయం గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్   నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’ .  బన్నీ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.