ఈ ఏడాది మొదట్లోనే అల వైకుంఠపురములో సినిమాతో భారీ హిట్ అందుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్‌. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్‌ లు తిరగరాయటమే కాదు ఇప్పటికీ అందుకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. ఈ సినిమా షూటింగ్ కొంత మేర పూర్తయ్యింది కూడా. అయితే బన్నీ మాత్రం ఇంకా పుష్ప షూటింగ్‌లో పాల్గొనలేదు.

ఈ లోగా కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో పుష్ప షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఎక్కువగా భాగం అవుట్ డోర్‌లోనే షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో షూటింగ్‌ ను కొనసాగించేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారట చిత్రయూనిట్. ముందుగా షూటింగ్ ను కొద్ది మంది నటీనటులు సాంకేతిక నిపుణులతో ప్రారంభిస్తున్నారు. అయితే షెడ్యూల్‌ షూటింగ్ జరిగినన్ని రోజులు టీం అంతా లొకేషన్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

అంతేకాదు షెడ్యూల్‌ పూర్తయ్యే వరకు కొత్త వారిని లోకేషన్‌లోకి అనుమతించటం, ఉన్నవారిని బయటకు పంపటం లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ షెడ్యూల్‌ షూటింగ్ పూర్తయ్యే లోపు ఈ అనుభవంతో తదుపరి షెడ్యూల్స్‌ను ప్లాన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట.

బన్నీ చూపించిన ప్లాన్ వర్క్‌ అవుట్ అయితే మరింత మంది స్టార్ హీరోలు ఇదే ఫార్ములాను ఫాలో అయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ సింహ విలన్‌గా నటించనున్నాడు.