Asianet News TeluguAsianet News Telugu

పుష్ప2 కోసం భారీ స్కెచ్ వేసిన బన్నీ,సుకుమార్. బడ్జెట్ ఎంత...? షూటింగ్ ఎక్కడ..?

పుష్పమూవీ పార్ట్ 1కు వచ్చిన రెస్పాన్స్ తో.. పుష్ప పార్ట్ 2ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి అంతకు మించి చూపించాలని ఆలోచనలో ఉన్నారు. అడ్ ద సేమ్ టైమ్. ఎక్కడ పొరపాటు లేకుండా ప్లాన్ చేస్తున్నారు టీమ్. 
 

Allu Arjun pushpa-2 movie update
Author
Hyderabad, First Published Jun 26, 2022, 5:32 PM IST

పుష్పమూవీ పార్ట్ 1కు వచ్చిన రెస్పాన్స్ తో.. పుష్ప పార్ట్ 2ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి అంతకు మించి చూపించాలని ఆలోచనలో ఉన్నారు. అడ్ ద సేమ్ టైమ్. ఎక్కడ పొరపాటు లేకుండా ప్లాన్ చేస్తున్నారు టీమ్. 

అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప  సంచలన విజయాన్ని సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, కథాకథనాల పరంగానే కాకుండా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక దాంతో సెకండ్ మూవీపై ఆడియన్స్ లో క్యారియాసిటిఅమాంతం పెరిగింది. 

ఈ సినిమాను చాలా వరకూ ఆంథ్రాలోని  మారేడుమిల్లి - రంపచోడవరం ఫారెస్టులో చిత్రీకరించారు. అడవిలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఫారిన్ లో అనుకున్నప్పటికీ, కోవిడ్ నిబంధనల కారణంగా అక్కడికి వెళ్లలేకపోయారు. 

కోవిడ్ వల్ల పుష్ప కోసం చేయాలి అనుకున్నవి చేయలేక పోయారు.. ఇక పుష్ప2 కోసం తగ్గేది లేదు అంటున్నారు మేకర్. ఖర్చువిషయంలో కాని. బడ్జెట్ విషయంలో కాని. .. ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా... సినిమాను తెరకెక్కించాలి అని ప్లాన్. దాని కోసం ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు టీమ్.  ఫారెన్ టూర్లతో పాటు.. ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది కూడా సెట్ చేసుకుంటున్నారు. 

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాను మాత్రం, ఇండొనేషియా .. సింగపూర్లలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. విదేశాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా 400 కోట్ల బడ్జెట్ ను పెట్టబోతున్నట్టు సమాచారం.  ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios