ఒక్క సినిమాతో తో లక్కీఛాన్స్ కొట్టేశాడు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల. దసరా సినిమాతో నానీకి మెమరబుల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు.. ఏకంగా ఐకాన్ స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ సాధించాడట. వివరాల్లోకి వెళితే.
కొంతమందికి లక్కు లక్కలాగా తగిలి అతుక్కుపోతుంది. టాలెంట్ కు అదృష్టం తోడైతే.. అద్భుతం జరుగుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది లైఫ ఇలానే ఉంటుంది. ఈ విషయంలో బెస్ట్ ఎక్జాంపుల్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల ను చెప్పకోవచ్చు. ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న నేచురల్ స్టార్ నానీకి... దసరా లాంటి సూపర్ హిట్ సినిమా తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు శ్రీకాంత్. ఇక దసరా సినిమా హిట్ తో శ్రీకాంతో మరో లక్కీ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శ్రీకాంత్ ఓదేలతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో తో బన్ని పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో పుష్ప2కి సంబంధించిన కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న నాలుగో సినిమా కావడంతో ఈమూవీ స్టార్ట్ కాకముందే అల్లు ఫ్యాన్స్ లో భారీగా అంచనాలుపెరిగిపోతున్నాయి. ఇక ఇదిలావుండగా అల్లు అర్జున్ మరో సినిమాను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది.
అయితే నేచురల్ స్టార్ నానీకి దసరా సినిమాతో సూపర్ హిట్ సినిమా అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం బన్నీ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ కు శ్రీకాంత్ ఓ కథ వినిపించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన కథా చర్చల్లో.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథాంశం బాగా నచ్చడంతో అల్లు అర్జున్ ఈ సినిమాకు అంగీకరించారని అంటున్నారు. త్రివిక్రమ్‌తో చేయనున్న సినిమా పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారని చెబుతున్నారు.
ఇక అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రపోజల్స్ గురించ అఫీషియల్ గా అనౌన్స్ మెంటె లేదు కాని.. ఫిల్మ్ నగర్ గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే .ఇక పుష్ప2 కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేయడమే టార్గెట్ గా మూవీని జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.
