Asianet News TeluguAsianet News Telugu

`ఊర్వశివో`తో అమ్మాయిలు శిరీష్‌ వెంటపడతారు.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ సక్సెస్‌ మా ఫ్యామిలీకి చాలా స్పెషల్

`ఊర్వశివో రాక్షసివో` చిత్ర సక్సెస్ పై అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఫ్యామిలీకి ఈ సినిమా విజయంచాలా  స్పెషల్‌గా భావిస్తున్నామన్నారు. 

allu arjun interesting comments on younger brother allu sirish in urvasivo rakshasivo success event
Author
First Published Nov 6, 2022, 11:56 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన తమ్ముడిపై, `ఊర్వశివో రాక్షసివో` చిత్రంపై ప్రశంసలు కురిపించారు. శిరీష్‌ నువ్వు ఏం చేసినా చేయకపోయినా నాకు ఇష్టమై, నేను ప్రేమిస్తూనే ఉంటానని వెల్లడించారు. తాజాగా అల్లు అర్జున్‌ `ఊర్వశివో రాక్షసివో` చిత్ర సక్సెస్ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయెల్‌ జంటగా, రాకేష్‌ దర్శకత్వంలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు, దీరజ్‌నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం(నవంబర్‌ 4)ని విడుదలైన విషయం తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బన్నీ గెస్ట్ గా వచ్చారు. 

ఇందులో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసిన అభిమానులు, ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా సక్సెస్‌ మాకుచాలా ముఖ్యమన్నారు. శిరీష్‌కి, ఫాదర్‌కి, అల్లు ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఫ్యామిలీకి చాలా పాజిటివ్‌ ఎనర్జీనిచ్చిందన్నారు. శిరీష్‌ గురించి మాట్లాడాలని చాలా రోజులుగా అనుకున్నానని, సందర్భం రాలేదని, ఇప్పుడు ఈ చిత్రం గురించి అందరు మాట్లాడుకుంటుంటేచాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చిందని ఈ ఈవెంట్ కి రావడం జరిగిందన్నారు. 

శిరీష్‌ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అతను ఏం చేసినా, చేయకపోయినా, ఎలా ఉన్నా తనకు ఇష్టమని,ప్రేమిస్తూ ఉంటానని పేర్కొన్నారు. సినిమాలో శిరీష్ బాగా నటించాడని మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నాకు గ్లామర్‌ సైడ్‌, రొమాంటిక్‌సినిమాలు వర్కౌట్ కాలేదని, సూట్‌ కాలేదని, కానీ శిరీష్‌కి బాగా సెట్‌ అయ్యాయని, ఈసినిమా తర్వాత అమ్మాయిలు శిరీష్‌ వెంటపడతారని తెలిపారు. దర్శకుడు రాకేష్‌ని అభినందించారు బన్నీ. అందరు బాగా చేసి దర్శకుడు బాగా చేయలేకపోతే డెడ్ బాడీకి డెకరేషన్‌ చేసినట్టు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫాదర్‌ అల్లు అరవింద్‌ని ఆయన అభినందించారు. థ్యాంక్స్ చెప్పారు. 

ఇక జీఏ2 బ్యానర్‌ని స్థాపించి నిర్మాత బన్నీ వాసు గురించి చెబుతూ, వాసు వేరు నేను వేరు కాదని పేరులోనే బన్నీ వాసు ఉన్నట్టు మేమిద్దరం ఒక్కటే అన్నారు. తనకు రెమ్యూనరేషన్ ఎంతా ఇవ్వాలని మా నాన్న ఆలోచిస్తారని, కానీ బన్నీకి మన సినిమాకైనా ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని ఆలోచిస్తాడని, ఆ విషయంలో నాన్న కంటే వాసుకే ఎక్కువ మార్కులు వేస్తానని తెలిపారు అల్లు అర్జున్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios