అల్లు అర్జున్‌కి ఏ విషయంలో భయం.. ఆయనకు నచ్చిన హీరోయిన్‌ ఎవరు? తండ్రి అయిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పేంటి? చిన్నప్పుడు బన్నీ చాలా సిన్సీయర్‌గా ఉండేవాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సమంత. మరి దీనికి స్టయిలీష్‌ స్టార్‌ చెప్పిన సమాధానాలు నవ్వులు పూయించాయి. మరి ఇంతకి బన్నీ ఏం చెప్పాడనేది తెలియాలంటే 2021 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన సమంత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆ రోజు రివీల్‌ కానున్నాయి. 

సమంత హోస్ట్ గా `ఆహా`లో `సామ్‌జామ్‌` అనే టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సెలబ్రిటీలు పాల్గొని అనేక ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఇటీవల క్రిస్మస్‌ కానుకగా మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రసారమైంది. కొత్త సంవత్సరం కానుకగా బన్నీ పాల్గొన్న `సామ్‌జామ్‌` ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని ఆదివారం విడుదల చేశారు. 

ఇందులో పలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు బన్నీ. మొదట ఫోన్‌లో బన్నీ కూతురు అర్హ మా డాడీని ఓ క్వశ్చన్‌ అడుగుతారా? అని అంటుంది. ఆ వెంటనే బన్నీ ఎంటర్‌ అవుతాడు. బన్నీని ఉద్దేశించి మోస్ట్ స్టయిలీష్‌ స్టార్‌, మోస్ట్ గూగుల్‌ సెర్చ్‌ టాలీవుడ్‌, మోస్ట్ హార్డ్ వర్కింగ్‌.. అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో `మీ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు? అని ప్రశ్నించగా, బన్నీ, సామ్‌ పెద్దగా నవ్వారు. 

ఆ తర్వాత బన్నీ చెబుతూ, తన జీవితంలో ఓ పెద్ద ఇన్స్ డెంట్‌ జరిగిందట. అదే ఆయనకు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పారు. ఆ తర్వాత తండ్రి అయిన తర్వాత ఇంట్లో బూతులు తగ్గించారట. కారణం తమ పిల్లలే అని చెప్పారు. పేరెంట్స్ లవ్‌ అన్‌కండీషనల్‌గా ఉంటుందని, ఆ తర్వాత నా అభిమానులదే అన్‌ కండీషనల్‌ లవ్‌ అని చెప్పారు. 

ఇంతలో బన్నీ ఫాదర్‌, నిర్మాత అల్లు అరవింద్‌ వచ్చారు. చిన్నప్పుడు కూడా బన్నీ హార్డ్ వర్కింగ్గా? అని ప్రశ్నించగా, అరవింద్‌ రెండు చేతులెత్తి దెండం పెట్టడం మరింత నవ్వులు పూయించింది.