బన్నీ: ఒక్కటి కాదు.. మూడు సినిమాలు

allu arjun future projects
Highlights

అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాకు నెగెటివ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.

అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాకు నెగెటివ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమా డిసప్పాయింట్ చేయడంతో సైలెంట్ అయిపోయాడు బన్నీ,. ఇప్పటివరకు తన తదుపరి సినిమా ఎవరితో అనే విషయాన్ని కూడా వెల్లడించలేదు. తన తోటి హీరోలు వరుస సినిమాలు లైన్ లో పెడుతుంటే బన్నీ మాత్రం వెనుకంజలో ఉన్నాడు. సరదాగా పారిస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

సినిమా విషయంలో క్లారిటీ లేకుండా ట్రిప్ కు వెళ్లాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే బన్నీ ఒక్కటి కాదు.. మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. ముందుగా విక్రమ్ కుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది పూర్తయిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయబోతున్నాడు.

ఆ తరువాత సురేందర్ రెడ్డితో మరో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇలా మొత్తంగా మూడు సినిమాలు ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి తమ తమ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సురేందర్ ఇటీవల బన్నీని కలిసి సినిమా గురించి చర్చించినట్లు చెబుతున్నారు. మరి అనుకున్నట్లుగానే ఈ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్తాయో లేదో చూడాలి!

loader