స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు.  ఈ సినిమా లో అల్లు అర్జున్ మొదటి సారి   మాస్ లుక్ తో కూడిన పాత్రను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న దానిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. స్మగ్లింగ్ నేపథ్యంలో  ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై రోజుకో వార్త బయిటకు వస్తూ అభిమానులను ఆనందపరుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ చాలా స్పెషల్ గా ఉండనుందట.ఈ  యాక్షన్‌ ఘట్టాల కోసం ప్రత్యేకమైన కసరత్తులు జరుగుతున్నాయి. రూ.6 కోట్ల వ్యయంతో వాటిని తెరకెక్కించనున్నారు.అది పులితో ఫైట్ సీన్ ఉంది అని.. చాలా నాచురల్ గా ఉంటుందని, అది తప్పకుండా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందని వినపడుతోంది. ఈ ఫైట్ సీన్ ను తెరకెక్కించడానికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నారని... దీని కోసం అల్లు అర్జున్ ప్రిపేర్ అవుతున్నాడట.


మరోవైపు పల్లెటూరి అమ్మాయిగా రష్మికా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దానికి దేవిశ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం సమకూరుస్తున్నారని.. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఎలా అలరించాయో ఇది కూడా అలానే ఆకట్టుకుంటుందని మొదటి నుంచి చెప్పుకొచ్చారు. కాగా ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ‘లోఫర్‌’ హీరోయిన్‌ దిశా పటానీ ఆడిపాడనున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దిశా ఇప్పటికే బాలీవుడ్‌లో పలు స్పెషల్ సాంగ్స్ లో  నటించారు.

 ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం బన్నీ కసరత్తులు జోరుగా కొనసాగుతున్నాయి. రోజూ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ విస్తృతంగా చర్చించుకుంటూ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. ఇందులో అల్లు అర్జున్‌ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. మొన్నటిదాకా సినిమాలో తాను పలికే సంభాషణలపైనే దృష్టి పెట్టిన అల్లు అర్జున్‌, ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా పూర్తి స్థాయిలో యాస సొగసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అది తన పాత్రకి మరింత మేలు చేస్తుందనేది అల్లు అర్జున్‌ ఆలోచన అని ఆయన సన్నిహితులు చెప్పారు.

చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. బన్నీ ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారట. రష్మిక హీరోయిన్  పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, అనసూయ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.