ప్రపంచంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం తెచ్చి పెట్టిన చిత్రం‘బాహుబలి’. ఆ చిత్రానికి పని చేసిన టీమ్ మళ్లీ ఓ సారి కలిసి, ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అవును...డైరెక్టర్‌ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు.

వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్‌’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్‌ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది. ‘బాహుబలి: ద బిగినింగ్‌’తోపాటు స్కైఫాల్‌, ‘హ్యారీపోట్టర్‌’ వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ టీమ్‌ మొత్తం ఆ వేదికపై కలవబోతున్నారు.  కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్‌ కాన్సెర్ట్‌ కూడా జరగనుంది.

ఈ ‘బాహుబలి’ టీమ్‌ రీ యూనియన్‌ అయ్యినప్పుడు ‘బాహుబలి –3’ డిస్కషన్ వస్తే బాగుండును అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే  రాజమౌళీకు ఈ ఆలోచన ఉందో లేదో కానీ, ప్రభాస్ అభిమానులు మాత్రం ఎదురుచూస్తున్నరనేది నిజం.