కరోనా కారణం సామస్య ప్రజల జీవితం అస్థవ్యస్తంగా మారింది. రోజు వారి కూలీతో బతికే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వలస కూలీల కథల వింటుంటే ప్రతీ ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొంత మంది ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్చలకు విరాళాలు ప్రకటించగా, మరికొందరు స్వయంగా తామే రంగంలోకి దిగి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిత్యావసరాలు, భోజనాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ సేవా కార్యక్రమాల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అందరికంటే ముందే ఉన్నాడు.

లాక్‌ డౌన్‌ ప్రకటించిన వెంటనే ముంబైలోని తాన హోటల్‌ బిల్డింగ్‌ను కరోనా రోగుల కోసం వినియోగించుకునేందుకు ఇచ్చాడు సోనూసూద్‌. అంతుకాదు తన వంతుగా ప్రతీ రోజు వేలాది మంది ప్రజలు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాడు. తాజాగా వలస కూలీలను తమ సొంత గ్రామాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అందుకోసం బస్సులను ఏర్పాటు చేసి ఇప్పటికే 12వేల మంది స్వస్థలాలకు చేర్చాడు. వలస కూలీల కోసం సోనూ చేస్తున్న కృషిని సినీ రాజకీయ ప్రముఖలు అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫిలిం మేకర్‌, నటుడు సోనూసూద్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సంజయ్‌ గుప్తా సోనూకు చేసిన వాట్సప్ సందేశాన్ని సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. `సోదరా తన తదుపరి చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ సోనూ సూద్‌ పాత్రలో కనిపించనున్నాడు. నాకు రైట్స్‌ దొరుకుతాయా..?` అంటూ కామెంట్ చేశాడు. దానికి సోనూ సూద్‌ సిగ్గు పడుతున్నట్టుగా ఎమోజీన్‌ను పంపించాడు. ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది.