బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా నటిస్తున్న చిత్రం పృథ్వీరాజ్ . చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించగా.. మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.
రోజు రోజుకీ హిందీ సినిమాల పరిస్థితులు పడిపోతున్నాయి. హై ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన భారీ సినిమాలు కూడా ఫ్లాప్‌లుగా మారుతున్నాయి. కొన్ని వారాల క్రితం, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఆధారంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ప్రోమోకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అక్షయ్ మరియు ఆయన టీమ్ ఆశ కోల్పోలేదు. అంతేకాకుండా ఈ చిత్రంలో హిందుత్వ కోణాన్ని బయటకు తీసుకువచ్చి చాలా ప్రచారం చేసారు. అయితే అనుకున్నట్లుగానే ఈ చిత్రం నెగిటివ్ రివ్యూలతో విడుదలైంది. చాలా మంది బాలీవుడ్ విమర్శకులు ఈ చిత్రాన్ని చాలా దారుణంగా ఆడుకునవ్నారు. ఈ సినిమా వర్కవుట్ కానీ చారిత్రాత్మక డ్రామా అని తేల్చేసారు.
అన్నింటికంటే, అక్షయ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా లేరు. అంత గొప్ప రాజు పాత్రను పోషించినా పెద్దగా పట్టించుకోవటం లేదు. అక్షయ్ లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు . కలెక్షన్ల విషయానికి వస్తే అదీ దారుణంగానే ఉంది. ట్రేడ్ లెక్కలు ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజు దాదాపు పది కోట్లకు చేరుకోలోదు, ఇది అక్షయ్ కుమార్ స్థాయికి చాలా తక్కువ. ఉన్నంతలో మేజర్ కు మంచి రివ్యూలు పొందడంతో, సామ్రాట్ పృథ్వీరాజ్ ఖచ్చితంగా బాక్సాఫీస్ పోటీని ఎదుర్కొంటున్నాడు.
మరాఠా యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ కథను అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో డాక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది రూపొందించాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో రూపొందించింది. విడుదలకి ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Aditynath) కోసం ఈ మూవీ ప్రత్యేక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. సినిమాని చూసిన ఆయన బావుందని, భారతదేశ సంస్కృతిని చూపించారని దర్శకుడిని, నటీనటులను ప్రశంసించారు. అనంతరం కలెక్షన్లపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అనంతరం అక్షయ్ కుమార్ ఆయన పోస్ట్‌పై స్పందిస్తూ.. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు.. యోగి ఆదిత్యనాథ్ గారు అంటూ ట్వీట్ చేశారు.
అనంతరం మరో రెండు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు సైతం పన్ను మినహాయింపునిచ్చాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan).. గొప్ప యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ జీవితంపై అక్షయ్ కుమార్ తీసిన చిత్రానికి మధ్యప్రదేశ్‌లో పన్ను మినహాయింపు ఇస్తున్నాం. యువత ఎక్కువ సంఖ్యలో సినిమాని చూసి ఆయన గురించి నేర్చుకుంటారని ఆశిస్తున్నాం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీనికి అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. చౌహాన్ శివరాజ్ జీ మీ నిర్ణయం భారతదేశపు గొప్ప యోధుని అద్భుతమైన కథను మరింత మందికి చేరువ చేసేందుకు ఉపయోగపడుతుంది. మూవీటీం నుంచి మీకు ధన్యవాదాలు అని రాసుకొచ్చారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) సైతం.. సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రానికి ఉత్తరాఖండ్‌లో పన్ను మినహాయింపు ఇస్తున్నాం. దేశభక్తి, ధైర్యం నిండిన చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడండి అంటూ రాసుకొచ్చారు. కాగా.. సంజయ్ దత్, సోనూ సూద్ వంటి దక్షిణాదిన పాపులారిటీ ఉన్న యాక్టర్స్ నటించిన.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదలయ్యింది.
