‘బొమ్మరిల్లు’  భాస్కర్ తో  అఖిల్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  కెరీర్ ప్రారంభం నుంచీ  ఇంతవరకు హిట్ అంటే తెలియని హీరోగా వెళ్తున్న అఖిల్ నాల్గవ సినిమాగా వస్తోంది ఈ చిత్రం.  ఈ సినిమా పై అక్కినేని ఫ్యామిలీ,అక్కినేని అభిమానులు ఆశలు మాములుగా పెట్టుకోలేదు. వరస ప్లాప్ లలో కూరుకుపోతున్న అఖిల్ ను బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఎంతవరకూ గట్టెక్కిస్తుందా.. అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రం కథేంటి అనేది హాట్ టాపిక్ అవటంలో వింతేముంది.

సిని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో అఖిల్ ఓ ఎన్నారై. తన వివాహం కోసం ఇండియాకు వస్తాడు. ఇక్కడ వరసపెట్టి అమ్మాయిలను చూస్తాడు. ఈ క్రమంలో పూజ హెగ్డే పరిచయం అవుతుంది. ఆమె తనకు ఫెరఫెక్ట్ అనుకుంటాడు. అయితే ఆమెతో సన్నిహితంగా మెలిగే కొలిదీ..కొన్ని క్వాలిటీస్ విషయంలో తప్పించి తనకు, ఆమెకు ఆమడ దూరం అని అర్దం చేసుకుంటాడు. ఆమె గురించి రోజు రోజుకీ నెగిటివ్ గా అనిపిస్తుంది. ఓ టైమ్ లో ఇంక ఆమె వద్దు అని డిసైడ్ అయ్యిపోయి..బ్రేకప్ చెప్పేస్తాడు. అయితే ఆ తర్వాత ఆమెపై ఉన్న ప్రేమ అతన్ని ఆమెలో తను నెగిటివ్ గా భావించే క్వాలిటీస్ ని పాజిటివ్ గా కనిపించేలా చేస్తుంది. పూర్తి ఫన్ తో, ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. 
 
 తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  హీరోయిన్ పూజ హెడ్గే పాత్ర ఓ స్టాండప్ కమిడియన్ అని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగులో ప్రాచుర్యంలోకి వస్తున్నారు స్టాండప్ కమిడయన్స్. ఆ విషయం గమనించిన దర్శకుడు ట్రెండీగా ఉంటుందని ఆ పాత్రను హీరోయిన్ చేత చేయిస్తున్నారు.  
 
అఖిల్ ఈ సినిమాలో అప్పర్ మిడిల్ క్లాస్ యువకుడుగా కనిపించనున్నారు. గీతా గోవిందం తరహాలో ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.