Asianet News Telugu

హగ్గులతో మోనాల్ కి అఖిల్ మెడిసిన్...హద్దులు దాటేస్తున్న రొమాన్స్

మోనాల్ కొంత అనారోగ్యానికి గురికాగా అఖిల్ చాలా ఫీల్ అయ్యాడు. ఆమెకు డాక్టర్స్ సెలైన్స్ వేసినట్లు సమాచారం. చేతికి సూదితో పడుకున్న మోనాల్ దగ్గరికి వచ్చిన అఖిల్ కొంత ఉద్వేగానికి గురయ్యాడు. మోనాల్ క్షేమ సమాచారం  అడిగి తెలుసుకున్నాడు. ఎప్పటిలాగే మోనాల్ అఖిల్ ని దగ్గరికి పిలిచి గట్టిగా హత్తుకుంది. గతంలో మోనాల్ నువ్వు నాకు మెడిసిన్, నువ్వు నాతో 10 నిముషాలు మాట్లాడితే నాకు చాలా రిలీఫ్ వస్తుందని చెప్పింది.

akhil hugs monal as she feeling ill ksr
Author
Hyderabad, First Published Oct 13, 2020, 12:13 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బిగ్ బాస్ హౌస్ లో మోనాల్- అఖిల్ లవ్ స్టోరీ కొనసాగుతుంది. ఈ సీజన్ కి వీరి లవ్ డ్రామా హైలెట్ అని చెప్పాలి. ఒకరిపై ఒకరు అలగడాలు, కోపాలు, ప్రేమగా మాట్లాడుకోడాలు అన్నీ ఈ ప్రేమ జంట మధ్యలో ఉంటాయి. హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ప్రేక్షకుల ఓట్లు అవసరం. మరి వారి ఆదరణ దక్కాలంటే ఎదో ఒక ప్రత్యేక కలిగి ఉండాలి. ఎదో ఇక పద్దతిలో ఎంటర్టైన్ చేయాలి. దానికోసం మోనాల్-అఖిల్ ఈ దారి ఎంచుకున్నారని అనిపిస్తుంది. 

మోనాల్ కొంత అనారోగ్యానికి గురికాగా అఖిల్ చాలా ఫీల్ అయ్యాడు. ఆమెకు డాక్టర్స్ సెలైన్స్ వేసినట్లు సమాచారం. చేతికి సూదితో పడుకున్న మోనాల్ దగ్గరికి వచ్చిన అఖిల్ కొంత ఉద్వేగానికి గురయ్యాడు. మోనాల్ క్షేమ సమాచారం  అడిగి తెలుసుకున్నాడు. ఎప్పటిలాగే మోనాల్ అఖిల్ ని దగ్గరికి పిలిచి గట్టిగా హత్తుకుంది. గతంలో మోనాల్ నువ్వు నాకు మెడిసిన్, నువ్వు నాతో 10 నిముషాలు మాట్లాడితే నాకు చాలా రిలీఫ్ వస్తుందని చెప్పింది.  ఇప్పుడు కూడా అఖిల్ ని హగ్ చేసుకొని, తనకు కావలసిన మెడిసిన్ తీసుకుంది. 

హౌస్ నుండి బయటికి వచ్చిన జోర్దార్ సుజాత మాత్రం మోనాల్, అఖిల్, అభిజిత్ లది వి యాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పింది. ఏక కాలంలో ఆమె ఇద్దరితో రొమాన్స్ చేస్తుందని చెప్పి సంచలనానికి తెరలేపింది. మోనాల్ చాలా క్లారిటీగా గేమ్ ఆడుతుందని, అభిజిత్ , అఖిల్ మాత్రం కన్ఫ్యూషన్ లో ఉన్నారని చెప్పింది. మరి హౌస్ లో కొనసాగడానికి మోనాల్ వీరిద్దరినీ అడ్డుపెట్టుకుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios