Asianet News TeluguAsianet News Telugu

‘అఖండ’ దసరాకే..కానీ చిన్న మెలిక

బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బాలకృష్ణలు కలిసి కనిపించే  క్లైమాక్స్ సీన్స్ ని, ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై తమిళనాడులోని ఓ దేవాలయం నేపథ్యంలో తెరకెక్కించారు. 

Akhanda might hit the theaters on October 13, 2021
Author
Hyderabad, First Published Aug 31, 2021, 8:20 AM IST

ఓ ప్రక్కన బాలయ్య దసరాకి తన అఖండ సినిమా సందడి చేయబోతున్నారంటూ వార్తలు వచ్చేస్తున్నాయి.  ఆయన స్పీడు చూస్తుంటే అవి నిజమే అనిపిస్తున్నాయి.  కాకపోత ఓ మెలిక ఆ రిలీజ్ డేట్ కు లింక్ అయ్యి ఉందిట. పెద్ద సినిమా అంటే లెక్కలు తప్పవు. అందులోనూ నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూసే సినిమా అంటే మరీను. 

 బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. సోమవారం వరకు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. రెండు పాటలు మాత్రమే బాలెన్స్ ఉంది.  మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే ‘అఖండ’ సందడి దసరాకి ఖాయమనే అర్థమవుతోంది. అందుకు అక్టోబర్ 13 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసారట. అయితే ఈ డేట్ ని అధికారికంగా నిర్మాతలు ప్రకటించలేదు. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లకు సంభందించిన జీవో. ఆంధ్రాలో టిక్కెట్ రేట్లకు సంభందించిన క్లారిటీ కోసం నిర్మాత వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ రేట్లును బాగా తగ్గిస్తూ ఏప్రియల్ లో జీవో ఇచ్చింది. ఇది పెద్ద సినిమాలు భారీగా దెబ్బకొట్టనుంది. దాంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయమై చర్చించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ రెండవ వారంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ తేలే విషయాలని బట్టి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటన ఉంటుంది. ముఖ్యంగా అఖంఢ చిత్రం రిలీడ్ డేట్ ప్రకటన ఉంది. 
  
దర్శకుడు బోయపాటి ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపించనున్నాడు. రైతుగాను .. అఘోర గాను ఆయన రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నిర్మితమవుతోంది.  ‘అఖండ’ సినిమా పతాక సన్నివేశాలు ఇటీవల తమిళనాడులో తెరకెక్కించారు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బాలకృష్ణలు కలిసి కనిపించే పతాక సన్నివేశాల్ని, ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై తమిళనాడులోని ఓ దేవాలయం నేపథ్యంలో తెరకెక్కించారు. 


బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.

Follow Us:
Download App:
  • android
  • ios