‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి గతంలో ‘మహా సముద్రం’ అనే క్రేజీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు హీరోలు మాత్రం చాలా కాలంగా సెట్ అవటం లేదు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందనుకున్న టైమ్ లో ఏదో ఒక సమస్య వచ్చి ఆగిపోతోంది.ఇంత ప్రతిభ ఉన్న దర్శకుడు ఇలా రెండేళ్లపాటు ఏ సినిమా చేయకుండా ఆగిపోవటం సినీ లవర్స్ కు బాధ కలిగించే విషయమే. అయితే ఈ సినిమా ఎట్టకేలకు సెట్ అయ్యిందని తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తవగానే సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి,సాధ్యమైనంత త్వరలో సినిమాని షూట్ కు తీసుకెళ్తారని చెప్తున్నారు. 

ఈ సినిమాలో ఇద్దరు  హీరోలకు అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే రవితేజ, నాగ చైతన్య, కార్తికేయ, విశ్వక్‌సేన్‌ పేర్లు వినిపించాయి కానీ ఏదీ ఖరారు కాలేదు. ఎట్టకేలకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాను తో పెద్ద దెబ్బ తిన్నా శర్వా ఈ ప్రాజెక్టు విషయంలో అజయ్ భూపతికు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట. నీకు నచ్చినట్లు కాస్టింగ్ చేసుకోమని అన్నారని, దాంతో ఇప్పుడు సెకండ్ హీరో ని ఫైనలైజ్ చేసారని చెప్తున్నారు. ఆ సెకండ్ హీరో మరెవరో కాదు...కార్తికేయ అని చెప్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తో స్టార్ గా మారిన కార్తికేయ ఈ సినిమా చేయటానికి సై అన్నారట.

ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని, దాదాపు ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక మాత్రం కాలేదట. మొదట ఈ చిత్రంలోనే శర్వానంద్‌ సరసన సమంత కనిపించబోతుందని అన్నారా. రీసెంట్ గా విడుదలైన ‘జాను’ సినిమా డిజాస్టర్ అవటంతో ఆ నిర్ణయం వాయిదా వేసినట్లు చెప్తున్నారు. సామ్ కూడా ఈ సినిమాలో పాత్రకు పెద్దగా ఉత్సాహం చూపించటం లేదని చెప్తున్నారు. 

అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ మధ్య నుంచి షూట్ ప్రారంభం కానుంది. ఈ లోగా శర్వానంద్ తన తాజా ప్రాజెక్టు శ్రీకారం ఫినిష్ చేసుకుని వస్తారు. ఈ సంవత్సరం ఆఖరకు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంతకాలం గ్యాప్ రావటంతో స్క్రిప్టుని మరింత గా తీర్చి దిద్దాడని కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వస్తుందని అంతా నమ్ముతున్నారు.