పవన్‌ కళ్యాణ్‌ చేతిలో ప్రస్తుత ఐదు సినిమాలున్నాయి. `వకీల్‌సాబ్‌`లో తన పార్ట్ షూటింగ్‌ పూర్తయ్యింది. త్వరలో `అయ్యప్పనుమ్‌ కోషయుమ్‌` రీమేక్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో సినిమా, హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ మరో సినిమా చేయనున్నారు. అలాగే సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో మరో సినిమా కమిట్‌ మెంట్‌ ఉంది. 

ప్రస్తుతం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`తోపాటు హరీష్‌ శంకర్‌ తో సినిమాని ప్రారంభించి రెండూ ఏకకాలంలో చేయనున్నారు. అనంతరం క్రిష్‌ డైరెక్షన్‌లో సినిమా ఉంటుంది. ఇందులో తాజాగా హీరోయిన్‌ ఎంపికైనట్టు తెలుస్తుంది. తెలుగుకి చెందిన తమిళ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ని హీరోయిన్‌గా ఎంపికయ్యారట. ఈ సినిమా పీరియాడికల్‌ నేపథ్యంలో రూపొందనుంది. ఇందులో బందిపోటు తరహాలో పవన్‌ పాత్ర ఉంటుందట.

 ఇందులో ఐశ్వర్య గిరిజన యువతి పాత్రలో కనిపించనుందట. ఆమె పాత్ర చాలా సవాల్‌తో కూడి ఉంటుందట. మరోవైపు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లోనూ ఐశ్వర్య  రాజేష్‌ నటించబోతుందని టాక్‌. మరి ఈ రెండింటిలోనూ నటిస్తుందా? లేక రెండింటిలో ఏదో ఒక్క సినిమాలో ఐశ్వర్య నటిస్తుందా? అనేది చూడాలి.