అమితాబ్, అభిషేక్ లు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అభిషేక్ భార్య మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కొంత కాలంగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. అయితే, అకస్మాత్తుగా ఆమెను ముంబాయిలోని లీలావతి ఆసుపత్రిలోచేర్చారు.

అందుకు కారణం కరోనా లక్షణాలు బయటపడడంతో పాటు, విడవని జ్వరం వేధిస్తుండడంతో ఆమెను కూడా నానావతి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ రాగా, ఆ చిన్నారి హోమ్ ఐసోలేషన్ లో ఉంది. 

ఇక వారం రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అదే సమయంలో అయన కుటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్ట్ లలో అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకినట్టు మొదట నిర్ధారణ అయింది. దానితో అయన కూడా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. తరువాతి రోజు ఐశ్వర్య రాయ్ బచ్చన్, వారి కుమార్తె ఆద్య కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

దీంతో వారిద్దరూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అమితాబ్ భార్య జయ బచ్చన్ కు కరోనా నెగెటివ్ వచ్చింది. ఇక వీరుంటున్న బంగ్లా జల్సా ను పూర్తిగా మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అకస్మాత్తుగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.