బాలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసగా ప్రముఖల ఇళ్లలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కు, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు పాజిటివ్ రావటంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్క పడింది. ప్రస్తుతం అమితాబ్‌ నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఇద్దరికి పాజిటివ్ రావటంతో ఇతర కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు.

తాజాగా అభిషేక్‌ సతీమణి, బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌కి, ఆమె కూతురు ఆరాధ్యకి కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అమితాబ్‌ కుటుంబంలో ఒక్క జయాబచ్చన్‌కు తప్ప అందరికీ పాజిటివ్‌ రావటంతో వారి నివాసం జల్సాను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రస్తుతం అమితాబ్‌ నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, మిగతా కుటుంబ సభ్యులు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.