రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల కరోనాకి గురైన విషయం తెలిసిందే. కోవిడ్‌19 పాజిటివ్‌ వచ్చినా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపింది. హోం క్వారంటైన్‌లో ఉండిపోయింది. అయితే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌లో ఆమెకి వైరస్‌ సోకినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత క్రిష్‌కి కూడా కరోనా సోకింది. ఎట్టకేలకు రకుల్‌ కరోనా నుంచి బయటపడింది. ఇటీవల టెస్ట్ చేయించుకోగా, నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. 

చెప్పడమే కాదు, ఏమాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్‌లో బిజీ అయిపోయింది. రకుల్‌ ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయి షాక్‌ ఇచ్చింది. వర్క్‌ పట్ల తనకున్న డెడికేషన్‌ ఏంటో తెలియజేస్తుంది రకుల్. ప్రస్తుతం ఆమె హిందీలో రూపొందుతున్న `మేడే` షూటింగ్‌లో పాల్గొన్నట్టు ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ మెయిన్‌రోల్‌ చేస్తున్నారు. అజయ్‌ పైలట్‌గా, రకుల్‌ కో పైలట్‌గా నటిస్తున్నారు. గతంలో అజయ్‌తో `దే దే ప్యార్‌దే` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.